Money : వినాయకుడి పూజలో ఉమ్మెత్త పువ్వులు, ఆకులు, కాయలను ఉపయోగిస్తారన్న సంగతి తెలిసిందే. ఉమ్మెత్వ పువ్వుకు ఆధ్యాత్మిక పరంగా ఎంతో విలువ ఇస్తారు. అలాగే ఆయుర్వేదంలోనూ ఈ చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, కాయలు, వేర్లతో అనేక ఔషధాలను తయారు చేస్తారు. ఎంతకీ తగ్గని మొండి వ్యాధులను నయం చేసే శక్తి సైతం ఉమ్మెత్తకు ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నవారు.. డబ్బు చేతిలో నిలవనివారు.. ఉమ్మెత్త పువ్వులతో ఈ విధంగా చేస్తే ధనాకర్షణ జరుగుతుంది. దీంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
వ్యాపారం చేసేవారు తమ వ్యాపార ప్రదేశంలో ఉమ్మెత్త పువ్వును డబ్బులు ఉంచే చోట పెట్టాలి. లేదా ఎవరూ చూడని చోట కార్యాలయంలో ఎక్కడైనా ఉంచాలి. ఇక ఇంట్లోనూ డబ్బులు ఉంచే చోట ఉమ్మెత్త పువ్వులను పెట్టాలి. ఉమ్మెత్త పువ్వులు వాడినకొద్దీ ఇంకో పువ్వును తెచ్చి పెడుతూ ఉండాలి. దీని వల్ల ధనం ఆకర్షించబడుతుంది.
వ్యాపారం చేసే వారు ఉమ్మెత్త పువ్వుతో పైన చెప్పిన విధంగా చేయడం వల్ల వ్యాపారంలో నష్టాలు తగ్గి లాభాలు వస్తాయి. వ్యాపారంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. అదేవిధంగా ఇంట్లో డబ్బులు పెట్టే చోట ఉమ్మెత్త పువ్వును ఉంచితే ధనం ఆకర్షించబడుతుంది. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు పోతాయి. చేతిలో డబ్బు నిలుస్తుంది. డబ్బును పొదుపు చేయగలుగుతారు. అన్ని విధాలుగా సమస్యలు తగ్గుతాయి.
దంపతుల మధ్య కలహాలు ఉంటే బెడ్ రూమ్‌లో ఉమ్మెత్త పువ్వులను పెట్టాలి. వాటిని ఎప్పటికప్పుడు వాడిపోయిన కొద్దీ మారుస్తుండాలి. ఒకటి లేదా 3 ఉమ్మెత్త పువ్వులను ఈ విధంగా పెట్టవచ్చు. దీంతో అన్ని విధాలుగా సమస్యలు పోయి సంతోషంగా ఉంటారు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి. దంపతులు అన్యోన్యంగా ఉంటారు. డబ్బు చేతిలో నిలిచి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.