తిరుమల శ్రీవారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏడు కొండల పైన ఉన్న తిరుమల శ్రీవారు.. దేశంలోనే సంపన్నమైన దేవుడు. అయితే.. తిరుమల శ్రీవారి దేవుడిని ప్రత్యక్షంగా చూడాలంటే తిరుమల వెళ్లాలి అంటారు పెద్దలు. తిరుమలలో కొలువై ఉన్న కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని చూస్తే ప్రత్యక్షంగా దేవుడిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ భావనను వ్యక్తపరచలేము. తిరుమల స్వామిని దర్శించుకున్నాక మనసు కూడా ఎంతో ఉల్లాసంగా, ప్రశాంతంగా, పాజిటివ్ గా అనిపిస్తుంది. అయితే, శ్రీ వారి గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
#1 శ్రీవారికి చెమటలు
తిరుమల శ్రీవారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఫారిన్ హిట్ తో వేడిగా ఉంటుంది. సముద్రమట్టానికి మూడువేల అడుగుల ఎత్తులో ఉండటం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి. కానీ స్వామి వారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తుంది. అర్చకులు వాటిని పట్టువస్త్రాలతో తుడుస్తుంటారు. పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు.
#2 రసాయనాలకు చెక్కుచెదరని విగ్రహం
ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరం ను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్దికాలంలోనే పగుళ్ళకు గురై విచ్చిన్నం అవుతుంది అనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం. కానీ శ్రీ వారి విగ్రహానికి నిత్యం పచ్చ కర్పూరం రాస్తున్నా ఏ మాత్రం చెక్కుచెదరక పోవడం ఆశ్చర్యకరం. దీన్నిబట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్లు భావిస్తారు.
#3 గర్భగుడిలో పూజించిన పువ్వులు వేర్పేడు లో ప్రత్యక్షం
తిరుమల వెంకటేశ్వరున్ని నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు. వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతం లోకి వెనక్కి చూడకుండా వేస్తారు. ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు ( శ్రీకాళహస్తికి వెళ్లే దారి) లో కనిపిస్తాయి.
#4 విగ్రహ రహస్యం
శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది. పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించిన విగ్రహం మళ్లీమళ్లీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం.
#5 శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు
తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడి కి కుడి వైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది.