Pooja Room Vastu Tips : ప్రతి ఒక్కరూ కూడా, ఇంట్లో పూజ గదిని పవిత్రంగా భావించి, పూజ గదిని శుభ్రం చేసుకుంటూ రోజు పూజలు చేస్తూ ఉంటారు. అయితే, కొంతమంది ఇళ్లల్లో పూజ గది ఉండదు. పూజ మందిరాన్ని, ఏదో ఒక గదిలో ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇది పూర్తిగా వాళ్ళ ఇష్టం. పూజ మందిరాన్ని ఇంట్లో ఏ వైపు పెట్టుకోవాలి..?, పూజ గది ఉంటే, ఏం చెయ్యాలి..? మంచి జరగాలంటే, ఎటువంటి విషయాలని గుర్తు పెట్టుకోవాలి…? అనేది చూద్దాం. ఎప్పుడైనా సరే, దేవుడు ని పూజించేటప్పుడు, తూర్పు వైపు మీరు తిరిగి దేవుడిని పూజించడం మంచిది.
ఇలా తూర్పు వైపు ఉండి, పూజించడం వలన అదృష్టం వస్తుంది. అదేవిధంగా పడమర వైపు ఉండి పూజించడం వలన కూడా మంచి జరుగుతుంది. డబ్బులు బాగా వస్తాయి. ఉత్తరం వైపు ఉండి కూడా పూజించవచ్చు. అప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కానీ, దక్షిణం వైపు మాత్రం ఉండి పూజించకండి. దక్షణం వైపు తిరిగి, పూజించడం వలన మంచి జరగదు. ఇబ్బందులు వస్తాయి.
ఎప్పుడూ కూడా పూజించేటప్పుడు, దేవుడు విగ్రహాలు, దేవుడు ఫోటోలని గచ్చు మీద పెట్టేయకూడదు. దీని వలన నెగటివ్ ఎనర్జీ వస్తుంది. పైగా ఇబ్బందులు వస్తాయి. చాలామంది దేవుడు పటాలకి పూలదండల్ని వేస్తూ ఉంటారు. ఆ దండలతో దేవుడి ముఖం కప్పేయకూడదు. పూజగదిని కానీ పూజ మందిరాన్ని కానీ మెట్ల కింద, ముఖద్వారం ఎదురుగా, బేస్మెంట్ లో, టాయిలెట్ల దగ్గర పెట్టకూడదు.
పూజగది లో ఎడమవైపు ఒక గంటను పెడితే మంచిది. నెగటివ్ ఎనర్జీని ఆ గంట తొలగిస్తుంది. ఏదైనా దేవుడి విగ్రహం కింద ఎర్రటి గుడ్డ పెడితే, చాలా మంచి జరుగుతుంది. మంచి సువాసన వచ్చే కొవ్వొత్తులు, ధూపం, అగరబత్తిలని వెలిగిస్తే, చక్కటి ఎనర్జీ ఉంటుంది. ఇలా వీటిని గుర్తు పెట్టుకొని ఆచరించినట్లయితే, అంతా మంచి జరుగుతుంది.