ఆధ్యాత్మికం

ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా.. అయితే శ్వేతార్కమూల వినాయకుడిని పూజించాల్సిందే!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనం ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ కొన్ని సార్లు అనేక ఆర్థిక ఇబ్బందులు&comma; జాతక దోషాలు&comma; మానసిక ఆందోళనలు మనల్ని చుట్టుముడతాయి&period; ఈ విధమైనటువంటి బాధల నుంచి బయటపడటానికి మనం ఎన్నో రకాల దేవదేవతలను పూజిస్తాము&period; అయితే వినాయకుడు అందరు దేవుళ్ళలోకల్లా ఎంతో ప్రత్యేకమైన దేవుడని చెప్పవచ్చు&period; ఈ క్రమంలోనే వినాయకుడిని మనం వివిధ రూపాల్లో పూజిస్తాం&period; ఇలా ఎన్నో రూపాలలో దర్శనమిచ్చే వినాయ‌కుడి రూపాలలో శ్వేతార్కమూల గణపతి ఒకటి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్వేతార్కమూల అంటే తెల్లజిల్లేడు చెట్టు మొదలు అని అర్థం&period; హిందూ సాంప్రదాయాల ప్రకారం తెల్ల జిల్లేడు చెట్టును ఎంతో పవిత్రమైన చెట్టుగా భావిస్తారు&period; ఈ క్రమంలోనే ఈ తెల్లజిల్లేడు చెట్టును శ్వేతార్కమూల గణపతిగా భావించి పూజలు చేయటం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు&comma; జాతక దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు&period; మరి ఈ గణపతి ని ఏ విధంగా పూజించాలి అనే విషయానికి వస్తే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64743 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;swetharka-ganesha&period;jpg" alt&equals;"if you are suffering from economical problems then do pooja to this ganesh " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆదివారం&comma; అమావాస్య&comma; పుష్యమి నక్షత్రం కలసి వచ్చేటప్పుడు తెల్లజిల్లేడు చెట్టు మొదలును సేకరించడం అత్యంత శ్రేష్టం&period; ఆరోజు ఉదయాన్నే శుచిగా శుభ్రం చేసి మట్టిలో నుంచి శ్వేతార్కమూలం సేకరించి&comma; మూలాన్ని శుభ్రంగా కడిగి పూజగదిలో ఎర్రని వస్త్రం పై ధూప దీప నైవేద్యాలతో పూజ చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి&period; మరికొందరు ఈ జిల్లేడు కొమ్మపై వినాయకుడి ప్రతిమలు చేయించుకుని పూజలు చేస్తుంటారు&period; ఇలా శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts