ఆధ్యాత్మికం

Lord Shiva : శివుడికి ఈ పువ్వుల‌తో పూజ చేస్తే.. ఏడు జ‌న్మ‌ల పాపం పోతుంది..!

Lord Shiva : చాలామంది సోమవారం నాడు శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. శివుడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అయితే శివుడికి కనుక ఈ పూలతో పూజ చేసినట్లయితే ఏడు జన్మల పాపం పోతుందట. శివుడికి ఉమ్మెత్త పువ్వులు అంటే చాలా ఇష్టం. ఒక ఉమ్మెత్త పువ్వుని శివుడికి పెడితే మోక్షం లభిస్తుంది. ఉమ్మెత్త పువ్వులతో అభిషేకాన్ని కూడా అక్కడక్కడా చేస్తూ ఉంటారు. మాంగళ్య‌ భాగ్యం లభించాలంటే శివుడికి ఉమ్మెత్త పువ్వులతో పూజ చేయాలి.

ఉమ్మెత్త పూలతో మాల కట్టి శివుడికి వేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. వినాయకుడికి కూడా ఉమ్మెత్త పువ్వులు అంటే ఇష్టం. దుర్గాదేవిని కూడా ఉమ్మెత్త పూలతో పూజించ‌వ‌చ్చు. దుర్గాదేవిని కనుక ఉమ్మెత్త పూలతో పూజించారంటే దరిద్రం అంతా తొలగిపోతుంది. నవరాత్రి రోజుల్లో ఏడవ రోజు సరస్వతీ దేవికి ఉమ్మెత్త పువ్వులతో అలంకరణ చేస్తారు. ఆ రోజు సరస్వతీ దేవి అనుగ్రహం పొందాలంటే ఉమ్మెత్త పువ్వులతో రంగోళీ వేసి పూజించడం వలన చక్కటి ఫలితాలు ఉంటాయి.

lord shiva likes these flowers very much

ప్రదోషకాలంలో శివుడికి ఈ పూలని పెట్టడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి. సర్ప దోషంతో బాధపడే వాళ్ళు లేదంటే ఇతర దోషాల వలన సతమతమయ్యే వాళ్ళు, శివుడిని ఆరాధించడం మంచిది. నెలకు రెండు సార్లు ప్రదోషం వస్తుంది. అమావాస్య, పౌర్ణమికి ఒక రోజు ముందు అలాంటి సమయంలో శివుడిని కొలిచినట్లయితే, శివుడి అనుగ్రహం కలుగుతుంది.

అలాగే సమస్త దేవతల‌అనుగ్రహం కూడా కలుగుతుంది. ప్రదోషం రోజున సాయంత్రం నాలుగు నుండి ఆరు గంటల సమయంలో శివుడిని ఆరాధించండి. శివుడు అభిషేక ప్రియుడు కనుక ఆ రోజు శివుడికి అభిషేకం చేస్తే కూడా మంచి ఫలితం కనబడుతుంది. బిల్వపత్రాలు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం మంచిది. ఇలా శివుడిని ఈ విధంగా పూజించి కష్టాల నుండి బయటపడండి.

Admin

Recent Posts