ఆధ్యాత్మికం

వెంక‌టేశ్వ‌ర స్వామిని ఇలా పూజిస్తే చాలు.. అష్టైశ్వ‌ర్యాలు మీ సొంత‌మ‌వుతాయి..!

కలియుగ దైవం.. సాక్షాత్తూ నారాయణుడే కలియుగంలో భక్తులను కష్టాల నుంచి కాపాడడానికి అర్చితామూర్తిగా శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించాడు. ఆ వేంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు ఏదీ అంటే పురాణాల ప్రకారం శనివారం. అందుకే శనివారం నాడు శ్రీవారికి విశేష పూజలు చేస్తుంటారు. ఆ రోజు గోవిందుడికి పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. శనివారం ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి తిరునామాన్ని నుదుటిన ధరించాలి. పూజ గదిలో వేంకటేశుని ప్రతిమ లేదా విగ్రహం లేదా ఫొటోను ఉంచి సాక్షాత్తూ ఆ శ్రీహరిగా భావించాలి. దీపాలను శుభ్రం చేసుకుని.. పువ్వులతో స్వామివారి పటాన్ని అలంకరించుకోవాలి. పూజగది, ఇంటి ముందు రంగవల్లికలు తప్పనిసరిగా ఉండి తీరాలి.

స్వామికి తులసీ దళాలతో అర్చన చేయాలి. తర్వాత ధూప దీప నైవేద్యాలను సమర్పించుకోవాలి. పాలు, పండ్లు, పాయసం, కలకండ, చక్కెర పొంగలి, పులిహోర వంటివి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. శ్రీ వేంకటేశ్వరస్వామి మహాత్మ్యంతో కూడిన పుస్తకాలను వాయనం ఇవ్వాలి. పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణా అనే మంత్రాన్ని జపించాలి. అలాగే సాయంత్రం వేళ కూడా ధూప దీపాలతో స్వామివారిని పూజించాలి. బియ్యం పిండితో చేసిన ప్రమిదలో దీపం వెలిగించాలి. ఈ బియ్యం పిండి దీపం కొండెక్కక ముందే చక్కెర పొంగలి, గారెలు నైవేద్యంగా సమర్పించాలి.

pray to lord venkateshwara swamy like this

అలాగే కర్పూర హారతి ఇవ్వాలి. ఒంటి పూట భోజనం చేయాలి. సాయంత్రం దీపారాధన, స్వామి నామాలను పారాయణం చేయాలి. ఆరోగ్యం సహకరించినవారు నేలపై చాప వేసుకుని నిద్రించాలి. శనివారం మాంసహారం, మద్యంకు దూరంగా ఉండాలి. ఇలా శనివార నియమాలను పాటిస్తే తప్పక స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

Share
Admin

Recent Posts