ఆధ్యాత్మికం

Rudraksha : న‌క్ష‌త్రం ప్ర‌కారం ఎవ‌రెవ‌రు ఎలాంటి రుద్రాక్ష‌ల‌ను ధ‌రించాలో తెలుసా..?

Rudraksha : రుద్రాక్ష ధారణ వల్ల పలు లాభాలు కలుగుతాయి. వీటిని శివ స్వరూపాలుగా భావిస్తారు. సాక్షాత్తు శివుడి అశ్రువులు భూమిమీద పడి రుద్రాక్షలుగా ఆవిర్భవించాయని పురాణోక్తి. అటువంటి రుద్రాక్షలు 21 రకాలు. అయితే ఎవరు ఏ రుద్రాక్షను ధరించాలి అనేది ప్రధాన సమస్య. దీనికి పండితులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒక్కో జన్మనక్షత్రం ఉంటుంది. వారి వారి జన్మనక్షత్రాల ప్రకారం రుద్రాక్షలను ధరించాల్సి ఉంటుంది. ఇక ఎవ‌రెవ‌రు ఏయే రుద్రాక్ష‌ల‌ను ధ‌రించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అశ్వని నవముఖి, భరణి షణ్ముఖి, కృత్తిక ఏకముఖి, ద్వాదశముఖి, రోహిణి ద్విముఖి, మృగశిర త్రిముఖి, ఆరుద్ర అష్టముఖి, పునర్వసు పంచముఖి, పుష్యమి సప్తముఖి, ఆశ్లేష చతుర్ముఖి, మఖ నవముఖి, పుబ్బ షణ్ముఖి, ఉత్తర ఏకముఖి, ద్వాదశముఖి, హస్త ద్విముఖి, చిత్త త్రిముఖి, స్వాతి అష్టముఖి, విశాఖ పంచముఖి, అనురాధ సప్తముఖి, జ్యేష్ఠ చతుర్ముఖి, మూల నవముఖి, పూర్వాషాఢ షణ్ముఖి, ఉత్తరాషాఢ ఏకముఖి లేదా ద్వాదశముఖి, శ్రవణం ద్విముఖి, ధనిష్ట త్రిముఖి, శతభిషం అష్టముఖి, పూర్వాభాద్ర పంచముఖి, ఉత్తరాభాద్ర సప్తముఖి, రేవతి చతుర్ముఖి.. ఇలా ఆయా న‌క్ష‌త్రాలు ఉన్న‌వారు ఆయా రుద్రాక్ష‌ల‌ను ధ‌రించాల్సి ఉంటుంది.

Rudraksha to be wean according to birth star

అయితే వీటితోపాటు ఆయా కామ్యాలు నెరవేరడానికి అంటే కోరికలు, సంకల్పాలు నెరవేరడానికి కొన్ని కాం బినేషన్లలలో రుద్రాక్షలను ధరించాలని పండితులు పేర్కొంటున్నారు. విద్య కావాలనుకున్నవారు చతుర్ముఖి, ఆరోగ్యం కోసం షణ్ముఖి, గ్రహబాధలు పోవడానికి నవముఖి తదితర‌ రుద్రాక్షలను ధరించాలి. అయితే వాటి వివరాలను పండితులు, జ్యోతిష నిపుణుల సూచనలతో ధరిస్తే మంచిది. దీంతో అనుకున్న ఫ‌లితాలు వ‌స్తాయి. అంతా మంచే జ‌రుగుతుంది.

Share
Admin

Recent Posts