ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఎక్కువ డబ్బును సంపాదించాలనే కలలు గంటాడు. అందుకోసమే ఎవరైనా కృషి చేస్తారు. అయితే కొందరికి మాత్రం డబ్బు చాలా అలవోకగా లభిస్తుంది. వద్దనుకున్నా అమితమైన ధనం వస్తుంది. ఇక కొందరికి ఎంత కష్టపడినా ఆశించినంత మేర కాదు కదా, అంతకు తక్కువ స్థాయిలోనే డబ్బు చేకూరుతుంది. అయితే నిజానికి అది వారి తప్పు కాదు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఎంత ధనం సంపాదిస్తాడో అది అతని రాశిని బట్ట ఉంటుందట. మొత్తం ఉన్న 12 రాశుల్లో కేవలం 5 రాశుల్లో పుట్టిన వారు మాత్రమే ధనం బాగా సంపాదిస్తారని, కోటీశ్వరులు అవుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మరి ఆ 5 రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
1. కన్యా రాశి… నేటి తరుణంలో ప్రపంచంలో ఉన్న చాలా మంది కోటీశ్వరుల్లో ఎక్కువ శాతం వారిది కన్యా రాశేనట. వీరికి ఏ అంశం పట్ల అయినా జాగ్రత్త ఎక్కువగా ఉంటుందట. ఏ పని చేసినా అందులో కచ్చితత్వం కోరుకుంటారట. అనుకున్న పనిని 100 శాతం పూర్తి చేసే వరకు విశ్రాంతి తీసుకోరట. ఏదైనా ఒక పని మొదలు పెడితే ఎన్ని సమస్యలు వచ్చినా దాన్ని మధ్యలో ఆపరట. మొదలు పెట్టిన పనిని సక్రమంగా పూర్తి చేసే వరకు వేరే పనిని తలకు ఎత్తుకోరట.
2. వృశ్చిక రాశి… ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ది ఇదే రాశి అట. వీరు ఏదైనా నష్టం జరిగితే దాని గురించే బాధపడుతూ కూర్చోరట. ఏది ఏమైనా ముందుకే సాగుతారట. తమకు నచ్చిన జీవితాన్ని వీరు ఆస్వాదిస్తారు తప్ప ఇతరుల ఇష్ట ప్రకారం నడుచుకోవాలంటే వీరికి నచ్చదట. కొత్త అంశాలను నేర్చుకోవాలని, వాటిపై పరిశోధనలు చేయాలనే ఆశయం వీరికి బలంగా ఉంటుంది. వీరు అందరికన్నా ఎక్కువ మానసిక శక్తిని కలిగి ఉంటారట. ఏది అనుకున్నా సాధిస్తారట. ఈ రాశి వారు చాలా త్వరగా కోటీశ్వరులు అవుతారట.
3. సింహ రాశి… ఇతరులను ముందుండి నడిపించే నాయకత్వ లక్షణాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయట. వీరు ఒక్కోసారి ఏదీ ఆలోచించకుండా వెంటనే త్వరిత గతిన పనులు పూర్తి చేస్తారట. ఇతరులతో చాలా మర్యాదగా ప్రవర్తిస్తారట. వీరికి ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎక్కువట. వాటితోనే కోటీశ్వరులు అవుతారట.
4. వృషభ రాశి… ఈ రాశి వారు విలువలు, సాంప్రదాయాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తారట. వీరికి ఓపిక, ఇతరులపై విశ్వాసం ఎక్కువగా ఉంటాయట. వీరికి తమపై తమకు నమ్మకం ఉండకపోయినా అనుకున్న పనిని సాధిస్తారట. వీరికి పట్టుదల, మొండితనం ఉంటాయట. ధనాన్ని కాపాడుకోవడమే కాదు, సంపాదించే శక్తి కూడా ఈ రాశి వారికి ఉంటుందట.
5. కర్కాటక రాశి… ఈ రాశి వారికి త్యాగ గుణం ఎక్కువగా ఉంటుందట. వీరు కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తారట. జాలి, దయ గుణాలు కూడా వీరిలో అధికంగానే ఉంటాయట. అయితే ఒక్కోసారి చిరాకు ఎక్కువగా ఉంటుందట. వీరు తమ మాటకారితనంతో ఇతరులను ఆకట్టుకుంటారట. ఇతరులు వీరితో సులభంగా కలసిపోతారట. వీరు ఏ పని అయినా చాలా సమర్థవంతంగా చేస్తారట. ఎదుటి వారితో చాలా చక్కగా నడుచుకుంటారట. అంతేకాదు, ధనం సంపాదించడంలోనూ బాగా రాణిస్తారట. కోటీశ్వరులు అవుతారట.