ఆధ్యాత్మికం

Lord Ganesha : వినాయకుడిని చూసి మ‌నం నేర్చుకోవాల్సిన 5 ముఖ్యమైన‌ విషయాలు ఇవే..!

Lord Ganesha : ఏ పూజ చేయాలన్నా మొదట మనం వినాయకుడిని పూజిస్తాం. వినాయకుడికి పూజ చేసిన తర్వాత మాత్రమే ఏ దేవుడినైనా పూజిస్తాం. వినాయకుడిని మొట్టమొదట పూజించడం వలన మనం తలపెట్టే ఏ కార్యమైనా కూడా పూర్తి అవుతుందని మన నమ్మకం. అందుకే తొలి పూజ వినాయకుడికి చేస్తారు. ఎలాంటి అవరోధాలు రాకుండా పని పూర్తి అవ్వాలని ప్రతిసారి తొలి పూజని వినాయకుడికి చేస్తారు. వినాయకుడి జీవితం నుండి నేర్చుకోవాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలని ఇప్పుడు చూసేద్దాం.

తల్లిదండ్రుల కంటే ఎవరు ఎక్కువ కాదని మనం వినాయకుడి నుండి తెలుసుకోవచ్చు. వినాయకుడు, కుమారస్వామి ఇద్దరిలో ఎవరిని గణాధిపతిగా చేయాలని ఆలోచిస్తూ శివపార్వతులు ఒక పరీక్ష పెడతారు. ముల్లోకాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలని ఎవరైతే మొదట చుట్టి వస్తారో వాళ్లే గణాధిపతి అని అంటారు. నెమలి మీద కుమారస్వామి బయలుదేరుతాడు. వినాయకుడు మాత్రం తల్లిదండ్రులైన శివపార్వతులను దేవుళ్ళుగా భావించి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాడు. ఇలా గణాధిపతి అయిపోతాడు.

things we should learn from lord ganesha

విధి నిర్వహణయే ముందు.. అని మనం వినాయకుడిని చూసి నేర్చుకోవచ్చు. పార్వతీ దేవి పిండి బొమ్మను చేసి కాపలాగా పెట్టి స్నానానికి వెళుతుంది. అయితే శివుడు ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళబోతుంటే వినాయకుడు అడ్డుకుంటాడు. ఇలా మనం విధినిర్వహణే ముందు అని వినాయకుడిని చూసి నేర్చుకోవచ్చు. ఆత్మ గౌరవమే ముఖ్యమని వినాయకుడిని చూసి నేర్చుకోవచ్చు. వినాయకుడి ఆకారం నచ్చకపోవడంతో స్వర్గలోకానికి వినాయకుడిని కాపలా పెట్టి అందరూ వెళ్తారు. వినాయకుడు దేవతలకి ఎలా అయినా బుద్ధి చెప్పాలని ఒక రోజు ఎలుకల సహాయంతో దేవతలు వెళ్లే దారంతా తవ్వించేస్తాడు. ఆఖరికి దేవతలు వచ్చి వినాయకుడికి క్షమాపణలు చెప్తారు.

వినాయకుడు కనీసం మధ్యలో విశ్రాంతి తీసుకోకుండా, నిరంతరాయంగా మహాభారత గ్రంథాన్ని వ్యాసుడు చెప్పింది చెప్పినట్లుగానే రాస్తూ ఉంటాడు. దీన్ని బట్టి చేపట్టిన పనిని వెంటనే పూర్తి చేయాలి అని మనం నేర్చుకోవచ్చు. అలానే ఓ నాడు వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వుతాడు. చంద్రుణ్ణి ఆకాశం నుండి పూర్తిగా కనబ‌డకుండా వెళ్ళిపోమని శాపం పెడతాడు వినాయకుడు. ఆ శాపాన్ని మళ్లీ మారుస్తాడు వినాయకుడు. అంటే దీన్ని బట్టి తప్పు చేసిన వాళ్ళని క్షమించాలి అని మనం వినాయకుడిని చూసి నేర్చుకోవచ్చు.

Admin

Recent Posts