Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఆ ఆల‌యాన్ని ద‌ర్శించుకుంటే పోయిన విలువైన ప‌త్రాలు, వ‌స్తువులు మ‌ళ్లీ దొరుకుతాయి..

Admin by Admin
April 18, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఏదైనా ఆపద వచ్చినప్పుడో,ఏవైనా వస్తువులు పోయినప్పుడో భగవంతుడిపై భక్తి ఎక్కువైపోతుంది. బాధలన్నీ చెప్పుకుని ఉపశమనం కల్పించాలని కోరుకుంటారు. అవన్నీ తీరుతాయో లేదో అనే విషయం పక్కనపెడితే చాలామందికి ఈ సెంటిమెంట్ ఉంటుంది. అయితే తమిళనాడు రాష్ట్రం రత్నమంగళంలో కొలువైన అరై కాసు అమ్మన్ కి మొక్కుకుంటే మాత్రం ఎంతటి కష్టమైనా తీరిపోతుందట. మరీ ముఖ్యంగా విలువైన వస్తువులు, పత్రాలు పోగొట్టుకున్నవారు అరైకాసు అమ్మన్ ని ప్రార్థిస్తే అవి దొరుకుతాయని విశ్వాసం.

అరై కాసు అమ్మన్ అంటే సగం నాణెం తల్లి.ఈ పేరు ఎందుకొచ్చిందంటే…పుదుక్కోట దగ్గరున్న గోకర్ణంలో ప్రగడాంబాల్ అనే అమ్మవారు కొలువు తీరి పూజలందుకుంటోంది. ఒకసారి విజయనగరాన్ని పాలిస్తున్న రాజు ఒక ముఖ్యమైన పత్రాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత వెదికినా అది దొరక్కపోవడంతో ప్రగడాంబాల్ అమ్మవారిని ప్రార్ధించాడు. ఆ తర్వాత ఆ పత్రం దొరికింది. సంతోషించిన రాజు అమ్మవారికి కృతజ్ఞతగా ఆవిడ రూపాన్ని అరకాసు విలువైన నాణెంపై ఓ వైపు ముద్రించి…వాటిని పండుగలు, ప్రత్యేక దినాల్లో రాజ్యంలో ప్రజలకు పంచిపెట్టేవాడు. అప్పటి నుంచి అరైకాసు అమ్మగా మారిపోయింది. ప్రజల్లో కూడా అమ్మవారి పట్ల విశ్వాసం పెరిగింది. పోయిన వస్తువుల గురించి అమ్మవారికి మొరపెట్టుకోవడం అవి దొరకడంతో మరింత నమ్మకం పెరిగింది.

visit araikasu amman temple if you lost anything

తమిళనాడులో రత్నమంగళలో లక్ష్మీ కుబేర ఆలయం ఉంది. ఏటా కళ్యాణోత్సవం సమయంలో అత్యంత విలువైన లక్ష్మీదేవి ఆభరణం ఒకటి కనిపించలేదు. ఎంత వెతికినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. దీంతో ఆ ఆలయ మేనేజింగ్ ట్రస్టీ అరై కాసు అమ్మవారిని ప్రార్ధించి, ఆ ఆభరణం దొరికితే అరైకాసు అమ్మకి అక్కడ ఆలయం నిర్మిస్తానని మొక్కుకున్నారట. ఆ తర్వాత ఆభరణం దొరకడంతో ట్రస్ట్రీ కుబేర ఆలయం సమీపంలోనే అరై కాసు అమ్మన్ కి ఆలయం నిర్మించారు.

ప్రస్తుతం అరైకాసు అమ్మ పీఠం తమిళనాడులోనే కాక ఇతర ప్రాంతాల్లోనూ ప్రసిద్ధి చెందింది. అవివాహితులు, పిల్లలు లేనివారు, కుటుంబ సభ్యులెవరైనా తప్పిపోయినప్పుడు …అమ్మవారికి మొరపెట్టుకుంటే మంచి ఫలితాలు పొందుతున్నారు. ముఖ్యంగా మంగళ, శుక్ర, ఆదివారాలు, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో అమ్మవారిని పూజిస్తే కోరికలు తప్పక నెరవేరుతాయని నమ్మకం. ఈ రోజుల్లో అమ్మవారి దగ్గరున్న 108 పత్రాల్లోంచి భక్తులు ఒక దానిని తీసుకోవటానికి అనుమతిస్తారు. ఆ కాగితంలో ఉన్న సూచనల ప్రకారం వారి కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. దీనినే దేవ ప్రశ్న అంటారు. ఆలయంలో అమ్మవారితో పాటూ వినాయకుడు, క్షేత్ర పాలకుడు కరుప్పన్ లను దర్శించుకోవచ్చు.

Tags: araikasu amman
Previous Post

మీ శ‌త్రువులు మీకు క‌ల‌లో క‌నిపిస్తున్నారా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..

Next Post

ఇంట్లో కుబేర యంత్రాన్ని ఇలా పెడితే డ‌బ్బే డ‌బ్బు.. ఆర్థిక స‌మ‌స్య‌లు ఉండ‌వు..

Related Posts

చిట్కాలు

డెలివ‌రీ అయ్యాక మ‌హిళ‌ల‌కు ఏర్ప‌డే స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే ఇలా చేయండి..!

July 4, 2025
చిట్కాలు

ఈ ఒక్క చిట్కాను పాటిస్తే చాలు.. మీ లివ‌ర్ ఎల్ల‌ప్పుడూ క్లీన్‌గా ఉంటుంది..

July 4, 2025
ఆధ్యాత్మికం

ఈ పొర‌పాట్ల‌ను మీరు కూడా చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ధ‌నం నిల‌వ‌దు జాగ్ర‌త్త‌..!

July 4, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీపై ల‌క్ష్మీదేవి క‌టాక్షం వ‌ర్షిస్తుంది..!

July 4, 2025
vastu

వాస్తు ప్రకారం ఈ మొక్క‌ల‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం వద్ద పెంచ‌కూడ‌దు..!

July 4, 2025
వినోదం

తండ్రి కొడుకులు కలిసి నటించినా హిట్ చేసుకోలేక డిజాస్టర్లు గా మిగిలిపోయిన సినిమాలు !

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.