నేను నా పెళ్ళికి ముందు ఒక సంవత్సరంలో 10 నుంచి 20 సార్లు తిరుపతి స్వామి దర్శనానికి వెళ్లే వాడిని , ఆ అనుభవంతో కొన్ని సలహాలు ఇస్తున్నాను , ట్రై చేసి చూడండి. దర్శనము మంగళ, బుధ , గురు వారాలలో ప్లాన్ చేసుకుంటే మీకు ఉచిత దర్శనం కూడా 3 లేదా నాలుగు గంటలలో అయిపోతుంది . జనవరి 20 వ తేదీ నుంచి , మార్చ్ 20 వ తేదీ వరకూ భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంటుంది , ఎందుకంటే ఆ సమయం లో విద్యార్థులు వారి తల్లి తండ్రులు సంవత్సరీక పరీక్షల ప్రేపరషన్ లో చాలా బిజీ గా ఉంటారు.
జూన్ 15 వ తేదీ నుంచి సెప్టెంబర్ 10 వరకూ భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ అయ్యాక , అందరూ బిజీ గానే ఉంటారు . డిసెంబర్ నెలలో కూడా తక్కువ రద్దీ గానే ఉంటుంది.
వేసవి సెలవులు , పురటాసి ( తమిళ నెల ) నెల , బ్రహ్మోత్సవాలు , శుక్ర, శని , ఆది వారాలు , వైకుంఠ ఏకాదశి లాంటి పర్వ దినాలు , దసరా ఉత్సవాలు, దీపావళి వంటి పండుగ రోజుల్లో, సంక్రాంతి, నూతన సంవత్సరం, ఉగాది వంటి రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రథ సప్తమి నాడు కూడా భక్తుల రద్దీ కనిపిస్తుంది.