Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

రహస్యంగా పెళ్లి చేసుకుని ఆశ్చర్యపరిచిన 10 స్టార్ హీరోయిన్ల లిస్ట్ వారెవరంటే ?

Admin by Admin
April 28, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు పెద్దలు.. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే మంచిదని అంటూ ఉంటారు.. సాధారణ ప్రజలు అయితే పెళ్లి విషయంలో కాస్త ముందుగానే ఆలోచించినా ఇండస్ట్రీలో ఉండేవారు మాత్రం నాలుగు పదుల వయసు వచ్చినా పెళ్లి విషయం ఆలోచించరు. అయితే, మన టాలీవుడ్‌ లో సీక్రెట్‌ గా పెళ్లి చేసుకున్న భామలు కూడా ఉన్నారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం. తిరుగులేని నటిగా, మహానటిగా దక్షిణాది చిత్ర పరిశ్రమను ఏలిన సావిత్రి, కెరియర్ పీక్స్ లో ఉండగానే అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని, పిల్లలు ఉన్న జెమినీ గణేషన్ ను రహస్యంగా పెళ్లాడి అభిమానులకు, చిత్ర పరిశ్రమకు షాకిచ్చారు. తెలుగు ఇంటి ఆడపడుచుగా దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ సత్తా చాటిన జయప్రద సైతం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ నహతాని ఆమె వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆయనకు పెళ్లయి, పిల్లలు ఉండడంతో తమ వివాహ విషయాన్ని బయటకు చెప్పలేదు జయప్రద.

అందాల తార శ్రీదేవి రెండు సార్లు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలినాళ్లలో అప్పటి స్టార్ హీరో మిథున్ చక్రవర్తిని ప్రేమించి ఆయనను రహస్యంగా పెళ్లాడారు. అయితే మూడేళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు. బోనీ కపూర్ ని ప్రేమించిన శ్రీదేవి అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సుస్వాగతం లో పవన్ కళ్యాణ్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత దక్షిణాదిలో గుర్తుండిపోయే పాత్రలు చేసిన దేవయాని, రాజకుమార్ అనే దర్శకుడితో ప్రేమలో పడ్డారు. అయితే ఈ విషయం ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ ఆమె ప్రయత్నం ఫలించలేదు. దీంతో కోరుకున్న వ్యక్తి కోసం కుటుంబ సభ్యుల మాటను కాదని ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు దేవయాని.

these actress married secretly

సినిమాల్లో జరిగినట్లు లేచిపోయి పెళ్లి చేసుకున్న మరో నటి అనన్య. ఈ మలయాళ కుట్టి, ఆంజనేయులు అనే వ్యక్తిని ప్రేమించే పారిపోయి వివాహం చేసుకున్నారు. ముద్దుల మావయ్యలో బాలకృష్ణ చెల్లెలిగా నటించి తెలుగు ప్రజల అభిమానం పొందిన సీత, తర్వాత హీరోయిన్ గా కోలీవుడ్ లో సత్తా చాటారు. ఈ క్రమంలో తమిళ నటుడు పార్దిబన్ ని ప్రేమించారు. కానీ వీరి కాపురం సజావుగా సాగలేదు. పెళ్లయిన కొన్నాళ్లకే ఈ జంట విడిపోయింది. తర్వాత సీరియల్ నటుడు సతీష్ ని 2010లో ఎవరికీ చెప్పకుండా రెండో వివాహం చేసుకున్నారు. బిచ్చగాడు సినిమాలో విజయ్ ఆంటోనీతో సమానంగా నటించి సెంటిమెంట్ పండించిన మలయాళ నటి సాత్నా టైటస్ కూడా లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. బిచ్చగాడు సినిమాకు బయ్యర్ గా ఉన్న కార్తీక్ ని ప్రేమించి అతని కోసం ఇంతటి సాహసం చేశారు.

పెళ్లి, ప్రేమ, పిల్లలు విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచి మొత్తం పరిశ్రమకే షాక్ ఇచ్చారు శ్రియ శరన్. రష్యాకి చెందిన అండ్రి కోషీవుని ప్రేమించిన విషయం గాని, పెళ్లి చేసుకున్న విషయం గాని, చివరికి సంతానం విషయం గాని బయటకు తెలియనీయకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత తీరిగ్గా విషయం చెప్పడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. నవరసాలను అద్భుతంగా పలికించే నేటితరం నటీమణుల్ని వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. అలాంటి వారిలో ఒకరు రమ్యకృష్ణ. అందం, అభినయంతో దక్షిణాదిని ఏలిన ఆమె హీరోలతో సమానంగా క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీతో ఉన్న పరిచయం ప్రేమగా మారింది. కొన్నేళ్లపాటు నడిచిన ప్రేమాయణానికి ఈ జంట 2003లో శుభం కార్డు వేసింది. వీరి పెళ్లి కూడా నలుగురికి తెలియకుండా రహస్యంగా ఒక గుడిలో జరిగింది.

Tags: Actress
Previous Post

వేస‌విలో ఈ ఆహారాలను తింటే ఇక అంతే..! వేడి, ఉక్క‌పోత‌, విరేచ‌నాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి..!

Next Post

చిరు, వెంకిలకే భయం పుట్టించిన ఉదయ్ కిరణ్.. ఎలాగంటే..?

Related Posts

వైద్య విజ్ఞానం

ఉద‌యం టిఫిన్ చేయ‌డం మానేస్తున్నారా.. అయితే ఎంత న‌ష్టం జరుగుతుందో తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

పురుషులు ఈ సూచ‌న‌లు పాటిస్తే లైంగిక శ‌క్తిని సుల‌భంగా పెంచుకోవ‌చ్చు..

June 13, 2025
lifestyle

మీరు భోజ‌నం చేసే తీరును బ‌ట్టి కూడా మీ వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో చెప్ప‌వ‌చ్చు.. ఎలాగంటే..?

June 13, 2025
చిట్కాలు

ఇవి ఏమిటో.. ఇవి అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో మీకు తెలుసా..?

June 13, 2025
inspiration

మ‌నిషి రూపాన్ని చూసి ఎన్న‌డూ అంచ‌నా వేయ‌కూడ‌దు.. ఆలోచింప‌జేసే క‌థ‌..

June 13, 2025
Off Beat

రోల్స్ రాయ్స్ కార్ల‌తో చెత్త ఊడ్పించిన మ‌హా రాజు.. ఈయ‌న చేసింది తెలిస్తే షాక‌వుతారు..

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!