వెనుకటికంటే పుట్టిన రోజు నాడు అమ్మ చేసి ఇచ్చే పాయసం తినో, లేదంటే గుడికి వెళ్లో బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదుగా… ప్రతి ఒక్కరు పాశ్చత్య పద్ధతిలో తమ తమ బర్త్ డే వేడుకలను జరుపుకుంటున్నారు. కేక్ కట్ చేసి, మందు, విందుతో దావత్ చేసుకుంటున్నారు. అయితే ఎవరు ఎలా బర్త్ డే చేసుకున్నా ఆరోజు మాత్రం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలట. అలా ఉంటే వారిలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. దీంతోపాటు బర్త్ డే చేసుకునే వారికి లక్ కూడా కలసి వస్తుందట. ఈ క్రమంలో అలాంటి వారు పుట్టిన రోజు నాడు ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
పుట్టిన రోజు నాడు ఉదయాన్నే తలస్నానం చేసి ఇష్టమైన దేవుడు లేదా దేవత ముందు దీపం వెలిగించాలి. అలా చేయడం వల్ల సమస్యలన్నీ దూరమవుతాయట. పుట్టిన రోజు నాడు దోషాలు ఏమైనా ఉంటే పోతాయట. పుట్టిన రోజు నాడు ఇంటికి దగ్గల్లో ఉన్న ఏదైనా ఒక ఆలయానికి వెళ్లాలట. అక్కడ తమ పేరిట లేదా దేవుడి పేరిట అర్చన, అభిషేకం వంటివి చేయిస్తే మంచి జరుగుతుందట. ఆత్మశుద్ధి అవుతుందట. పుట్టిన రోజు నాడు వెంట్రుకలు, గోళ్లను అస్సలు తీయవద్దట. అలా చేస్తే అది వారి వారి ఆర్థిక సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందట. చాలా కష్టాలను తెచ్చి పెడుతుందట. పుట్టిన రోజు నాడు మాంసాహారం తినడం, మద్యం సేవించడం వంటివి చేస్తే నెగెటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందుతుందట. ఇది అంత మంచిది కాదట. వారికి అన్నీ అశుభాలే జరుగుతాయట.
బర్త్ డే నాడు ఎవరైనా ఇతరులతో ప్రేమగా ఉండాలట. ఎలాంటి వివాదాల్లోనూ ఇరుక్కోవద్దట. అలా ఉంటే వారి జీవితం సాఫీగా సాగుతుందట. పుట్టిన రోజు నాడు ఎవరైనా పేద వారికి అన్నం దానం చేస్తే దాంతో ఆ దానం చేసిన వారికి అమితమైన పుణ్యం కలుగుతుందట. అదృష్టం కలసి వస్తుందట. బర్త్ డే నాడు పెద్దల ఆశీర్వచనాలు కచ్చితంగా తీసుకోవాలట. దీంతో ఆయుష్షు పెరుగుతుందట. ఎక్కువ కాలం సంతోషంగా జీవిస్తారట.