ఆధ్యాత్మికం

పూజ తరువాత మన ఇంట్లో కర్పూరం ఎందుకు వెలిగిస్తారో తెలుసా?

సాధారణంగా మనం నిత్యం చేసే పూజలలో కర్పూరానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తాము. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజ అనంతరం కర్పూర హారతులు ఇవ్వడం చూస్తుంటాము. అయితే ఈ విధంగా కర్పూర హారతులు ఎందుకు ఇస్తారు? కర్పూర హారతి ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

ప్రతిరోజు మనం పూజ అనంతరం కర్పూర హారతులు ఇవ్వడం వల్ల మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి. వెలుగుతున్న కర్పూరం నుంచి వచ్చే సువాసన మన చుట్టూ పరిసరాలను శుభ్రం చేస్తుంది. కర్పూరం నుంచి వెలువడే పొగ దుష్టశక్తులను దూరం చేస్తుంది. ఈ క్రమంలోనే మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను తొలగించి అనుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.

why karpooram is lit after pooja

కర్పూరం కేవలం పూజ సమయంలో మాత్రమే కాకుండా దిష్టి తీసే సమయంలో కూడా వెలిగించి దిష్టి తీస్తుంటారు. ఈ విధంగా దిష్టి తీయడం వల్ల ఆ వ్యక్తిపై లేదా వాహనాలపై ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు, నరదృష్టి తొలగిపోతుందని భావిస్తారు.అదేవిధంగా కర్పూరం వెలిగించడం ద్వారా వచ్చే వెలుగులు మన జీవితంలో కూడా వెలుగులు నింపాలని, పూజా సమయంలో నిత్యం కర్పూర వెలుగులు చిమ్మే ఇల్లు సిరి సంపదలతో తులతూగుతూ ఉందని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా కర్పూరాన్ని వెలిగించడం ద్వారా కేవలం అత్యధికంగా మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి.

Admin

Recent Posts