ఆధ్యాత్మికం

చాటపై పాదాలు ఎందుకు ఉంచరాదు?

సంప్రదాయ చాటను వెదురుతో కాని, ఈనెలతో కానీ చేస్తారు. ఇలాంటి చాటను ధాన్యాన్ని చెరగడానికి వాడేవారు. ధాన్యంలో ఉన్న పొట్టు చెరగడం వల్ల వంటకు వాడే ధాన్యం శుభ్రపడుతుంది. భారతీయులు వంట ధాన్యాన్ని ఎంతో పవిత్రంగా భావించేవారు. కాబట్టి చాటను కూడా అలాగే భావించేవారు.

సంప్రదాయక విశ్వాసం ప్రకారం చాటపై కాలు పెట్టడం పాపంగా పరిగణించేవారు. కావున ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించేవారు. ఈ విశ్వాసంలో రెందు ప్రధానాంశాలు దాగి ఉన్నాయి. మొదటిది ఏమిటంటే చాట అల్లడానికి వాడిన వెదురు పదునుగా ఉంటుంది. కాబట్టి గాయం అయ్యే అవకాశం ఉంది. రెండవది శుభ్రతకు సంబంధిచినది. పాపభీతితో చాటపై కాలుపెట్టడానికి సందేహిస్తాము. కాబట్టి చాట శుభ్రంగా ఉండడమేకాక, చాటలో చెరిగే ధాన్యం కూడా మలినపడకుండా వుంటాయి.

why we should not put our legs on chata

దీనిని బట్టి మన సంప్రదాయక నమ్మకాలలో శాస్త్రీయమైన ఏదో అంతరార్ధం దాగివున్నదని మనము గమనించవచ్చు.

Admin

Recent Posts