ఆధ్యాత్మికం

హిందువులు ఆవును ఎందుకు పవిత్రంగా భావిస్తారు?

హిందువులు ఆవును గోమాత అని పిలుస్తారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించదం ఎంతో శుభశకునంగా భావించబడింది. శ్రీ కృష్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించాడని పురాణాలు చెబుతున్నవి. ఆవు పాలలోని వివిధ గుణాల కారణంగా ఆవు పాలను అమృతం అని అంటారు.

ఆవుపాలు ఔషదాలలో ఘటకాంశంగా నిలచింది. ప్రతిరోజు మన ఆహారంలో పాల ఉత్పత్తులైన పెరుగు, వెన్న, నెయ్యి మొదలగునవి వాడబడుతాయి. ఇతర ప్రాణుల మలాన్ని అశుద్ధంగా చెప్పబడినా, ఆవు పేడ మాత్రం ఎంతో శుభకరమైనదిగా చెప్పబడింది. సైన్స్ ఈ విషయాన్ని అంగీకరిస్తూ ఆవు పేడ చెడువాసన లేనిదేకాక అనుకూల శక్తిని వెల్లడిస్తుందని చెప్పడం జరిగింది.

why hindus feel cow is sacred

మొక్కలకు మరియు చెట్లకు ఆవుపేడ మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. ఔషదాలలో ఆవు మాత్రం ఎంతో వైభవాన్ని కలిగివుంది. పూజల్లో సైతం ఆవు మూత్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది. గొప్ప ఔషదగుణాలు కలిగిన గోరోజనము ఆవు నుదుటి భాగంలో ఓ సంచిలాంటి దానిలో ఉంటుంది. గోరోజనము ఆయుర్వేదం సూచించే ఓ గొప్పదైన ఔషదం. ఇన్ని ప్రయోజనాలతో కూడిన, ఎంతో ఉపయోగాత్మకమైన ఆవుకు గోమాత‌ అనే పేరు సార్ధకమైనదే.

Admin

Recent Posts