Magadheera Movie : తెలుగు సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది మగధీర. చారిత్రాత్మక నేపథ్యానికి, ప్రస్తుతానికి లింక్ పెడుతూ.. దర్శకధీరుడు రాజమౌళి తీసిన ఈ సినిమా భారతీమ చిత్రసీమను ఉలిక్కిపడేలా చేసింది. అప్పట్లోనే రూ. 40 కోట్ల బడ్జెట్ వెచ్చించి, ఒక విజువల్ వండర్‌ని తెలుగు చిత్ర పరిశ్రమకు అందించాడు జక్కన్న. ఈ సినిమాలో ప్రతీదీ అద్భుతమే. ముఖ్యంగా.. 100 మందితో రామ్ చరణ్ చేసే పోరాట సన్నివేశం ఈ సినిమాకే హైలైట్. అటు రాజమౌళి క్రేజ్ ఇటు రామ్ చరణ్ క్రేజ్ కూడా ఈ సినిమాతో అమాంతం పెరిగిపోయాయి.
సినిమాలో 400 ఏళ్ల తరవాత మగధీర హర్షగా మళ్లీ జన్మిస్తాడు. అంతే కాకుండా 400 ఏళ్ల తరవాత యువరాణి మిత్రవింద మళ్లీ జన్మిస్తుంది. ఇక వీరిద్దరూ మొదటిసారి కలుసుకునే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సీన్ నుండే అసలు కథ కూడా మొదలవుతుంది. మొదటిసారి కాజల్ చేయి తగలగానే రామ్ చరణ్ కు పూర్వజన్మ గుర్తుకు వస్తుంది. ఆ సమయంలో ఇద్దరి మధ్య కరెంట్ పాస్ అయినట్టుగా చూపిస్తాడు. ఆ తరవాత మళ్లీ కొన్నిసార్లు కూడా ఇదేరకంగా కరెంట్ పాస్ అవుతుంది.
అయితే ఈ సినిమా చూసిన తరవాత కొంతమందికి వచ్చిన డౌట్ ఏంటంటే ఇద్దరూ కలుసుకున్నారు. ఓకే మరి పెళ్లి తరవాత ఇద్దరూ ఒకరిని ఒకరు తాకినా కూడా ముందులానే కరెంట్ పాస్ అవుతుందా..? లేదంటే అలా షాక్ రావడం ఆగిపోతుందా.. దీనిపై దర్శకుడు కూడా ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. నిజానికి సినిమా వచ్చి చాలాకాలం అవుతోంది కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం వల్ల ఈ సీన్ కు సంబంధించిన మీమ్స్ నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఏదిఏమైనా కథ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది కాబట్టే చిన్నచిన్న లాజిక్స్ ను పక్కన పెట్టేశారు.