మలబద్దకం సమస్య అనేది సహజంగానే దాదాపుగా అందరికీ వస్తుంటుంది. దీంతో తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి. ఒక పట్టాన అది తగ్గదు. మలబద్దకం వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన 7 ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
1. రోజూ తగినంత నీటిని తాగకపోతే శరీరంలో ద్రవాలు తగ్గిపోతాయి. దీంతో డీహైడ్రేషన్ బారిన పడతారు. ఫలితంగా మలబద్దకం వస్తుంది. కనుక రోజూ తగినంత మోతాదులో నీటిని తాగాలి. రోజూ కనీసం 2 లీటర్ల నీటిని తాగితే మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు.
2. రోజూ తీసుకునే ఆహారంలో ఫైబర్ లేకపోయినా మలబద్దకం వస్తుంది. కనుక ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాలి. రోజూ కనీసం 30 గ్రాముల మోతాదులో శరీరానికి ఫైబర్ అందేలా చూసుకుంటే జీర్ణ సమస్యలు రావు. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది. ఫైబర్ ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, చిరు ధాన్యాలలో ఉంటుంది. వీటిని తింటే మలబద్దకం ఏర్పడదు.
3. బ్రోకలీలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీర అంతర్గత వ్యవస్థలను శుభ్రం చేస్తాయి. బ్రోకలీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని ఉడకబెట్టి రోజూ ఒక కప్పు మోతాదులో తింటున్నా మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు.
4. మలబద్దకం సమస్యను అంజీర్ పండ్లు తగ్గిస్తాయి. ఈ పండ్లను నేరుగా తినవచ్చు. లేదా డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ లభిస్తాయి. డ్రై ఫ్రూట్స్ అయితే నీటిలో నానబెట్టి తినడం మంచిది. ఉదయం నానబెట్టి రాత్రి నిద్రకు ముందు తినవచ్చు. లేదా రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపునే తినవచ్చు. దీంతో మలబద్దకం సమస్యను తగ్గించుకోవచ్చు.
5. అవిసె గింజలను సూపర్ ఫుడ్‌గా చెబుతారు. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఈ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. రోజూ అవిసె గింజల పొడిని 2 టీస్పూన్ల మోతాదులో పెరుగులో కలిపి తీసుకోవచ్చు. లేదా పెనంపై ఆ గింజలను కొద్దిగా వేయించి ఒక గుప్పెడు మోతాదులో తినవచ్చు. దీంతో మలబద్దకం తగ్గుతుంది.
6. పైనాపిల్ జ్యూస్‌ను రోజూ ఒక గ్లాస్ మోతాదులో తీసుకుంటే మలబద్దకం నుంచి బయట పడవచ్చు. పైనాపిల్‌లో ఉండే ఎంజైమ్‌లు, విటమిన్లు మలబద్దకం సమస్యను తగ్గిస్తాయి.
7. యాపిల్ లేదా అరటి, బొప్పాయి పండ్లను రోజూ తీసుకుంటున్నా మలబద్దకాన్ని తగ్గిస్తాయి. జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365