ప్రస్తుత తరుణంలో స్థూలకాయం అనేది పెద్ద సమస్యగా మారింది. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, అస్తవ్యస్తమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ చేయకపోవడం వంటి అనేక కారణాల వల్ల చాలా మంది అధికంగా బరువు పెరుగుతున్నారు.
అయితే రైస్‌ను తింటే అధికంగా బరువు పెరుగుతారని చాలా మంది అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. నిజానికి రైస్‌ను తినడం వల్ల బరువు తగ్గుతారు. ఎందుకంటే అది సులభంగా జీర్ణమవుతుంది. కొవ్వు రూపంలో పేరుకుపోదు. వైట్ రైస్ చాలా సులభంగా జీర్ణమవుతుంది. బ్రౌన్ రైస్‌తో బరువును తగ్గించుకోవడం తేలిక అని చెప్పవచ్చు. ప్రతి పూటకు 50-100 గ్రాముల రైస్‌ను తినవచ్చు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడైనా రైస్‌ను తినవచ్చు. దీని వల్ల స్థూలకాయం రాదు. ఈ క్రమంలోనే బ్రౌన్ రైస్, వైట్ రైస్‌లలో బరువును తగ్గించుకునేందుకు ఏది అద్భుతంగా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రౌన్ రైస్ అంటే ఏమిటి ?
బ్రౌన్ రైస్ అంటే పాలిష్ చేయబడని బియ్యం. కేవలం ధాన్యం గింజల మీద ఉండే పొట్టును మాత్రమే తీస్తారు. తరువాత దాన్ని అలాగే ఉంచుతారు. దీంతో బియ్యం గింజలు బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. అందువల్లే దాన్ని బ్రౌన్ రైస్ అంటారు. ఈ రైస్‌లో వైట్ రైస్ కన్నా పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే రుచి భిన్నంగా ఉంటుంది.
వైట్ రైస్ రుచి చాలా మందికి నచ్చుతుంది. బ్రౌన్ రైస్ రుచి నచ్చదు. అందువల్ల చాలా మంది వైట్ రైస్‌ను తినేందుకే ఇష్టపడుతారు. ఒక ఒక కప్పు బ్రౌన్ రైస్‌లో 3.5 గ్రాముల వరకు ఫైబర్ లభిస్తుంది. అదే వైట్ రైస్ అయితే ఒక కప్పు తింటే 1 గ్రామ్ ఫైబర్ మాత్రమే లభిస్తుంది.
బ్రౌన్ రైస్‌ను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
బ్రౌన్ రైస్‌ను తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
వైట్ రైస్ అంటే ఏమిటి ?
బ్రౌన్ రైస్‌ను మరింతగా పాలిష్ చేస్తే వైట్ రైస్ తయారవుతుంది. దీంతో పోషకాలను కోల్పోతాం. ముఖ్యంగా బ్రౌన్ రైస్ కన్నా వైట్ రైస్‌లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. దీంతోపాటు ఆ పొట్టుతో ఇతర పోషకాలు కూడా పోతాయి.
బ్రౌన్ రైస్‌ను పాలిష్ చేసినప్పుడు బియ్యం తెలుపు రంగులోకి మారతుంది. పాలిష్ వేయడం వల్ల అవసరమైన విటమిన్లు, మినరల్స్ నశిస్తాయి. దీంతో కేవలం కార్బొహైడ్రేట్లు మాత్రమే మిగులుతాయి.
వైట్ రైస్ ప్రయోజనాలు
వైట్ రైస్ తేలిగ్గా జీర్ణమవుతుంది. తక్షణ శక్తిని అందిస్తుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
బరువు తగ్గేందుకు వైట్ రైస్ లేదా బ్రౌన్ రైస్.. ఏది ఉత్తమం ?
అధ్యయనాల ప్రకారం.. బరువు తగ్గే విషయానికి వస్తే బ్రౌన్ రైస్ మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్‌ను తింటుండాలి. బ్రౌన్ రైస్‌లో ఫైబర్, ఇతర పోషకాలు, వృక్ష సంబంధ సమ్మేళనాలు ఉంటాయి. వైట్ రైస్ కన్నా పోషకాలు బ్రౌన్ రైస్‌లోనే అధికంగా ఉంటాయి. అందువల్ల జీర్ణాశయం ఎల్లప్పుడూ నిండిన భావన కలుగుతుంది. ఆహారాన్ని తక్కువగా తింటాం. తక్కువ క్యాలరీలు లభిస్తాయి. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గేక్రమంలో రోజూ ఎన్ని క్యాలరీలు వచ్చే ఆహారాన్ని తీసుకుంటున్నామనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్‌లోనే క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ అధికంగా లభిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. జీర్ణశక్తి మెరుగు పడుతుంది. ఇది అధిక బరువును తగ్గిస్తుంది. కొవ్వును కరిగించుకునేందుకు, అధిక బరువును తగ్గించుకునేందుకు బ్రౌన్ రైస్‌ను మించింది లేదు. అందువల్ల బ్రౌన్ రైస్‌ను రోజూ తింటే ప్రయోజనాలను పొందవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365