Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఎదిగి టాలీవుడ్ మెగాస్టార్ అయ్యాడు. ఆయన చిత్రాలు బాక్సాఫీస్‌ని ఎంతగా షేక్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. అయితే చిరు నటించిన చిత్రాలలో స్టేట్ రౌడీ చిత్రం కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఫస్ట్ నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా ఆ తర్వాత పాజిటివ్ టాక్ తో దూసకుపోయింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది.ఈ చిత్రంలో రాధా, భానుప్రియ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా బి. గోపాల్ సినిమాకి దర్శకత్వం వహించాడు.
మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్ బ్యానర్ పై డి సుబ్బిరామిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకి బప్పి లహరి సంగీతం అందించారు. ముందు ఈసినిమాకి కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కిన కూడా చివరకు బీ గోపాల్‌కి అవకాశం దక్కింది. 1989 మార్చి 23వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా నైజాంలో కోటి రూపాయల కలెక్షన్లు సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా సక్సెస్ చూసి అమితాబ్ షాక్ అయ్యాడట.
ట్రేడ్ గైడ్ అనే బాలీవుడ్ మాక్సిన్ చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ సినిమా కలెక్షన్ల వివరాలను ప్రచురించి చిరంజీవి సినిమా కలెక్షన్లతో పోలిస్తే అమితాబ్ సినిమాను వేర్ ఇస్ అమితాబ్ అని ప్రశ్నిస్తూ ఆర్టికల్ రాసింది. దీంతో చిరంజీవి పేరు బాలీవుడ్ లోను మోరుమ్రోగిపోయింది. సక్సెస్ ఫుల్ గా వంద రోజులు చేసుకొని చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా ఈ చిత్రం నిలవగా, వంద రోజుల వేడకుని ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.