Balakrishna : తెలుగు చిత్ర పరిశ్రమకు మూలస్తంభంగా సీనియర్ ఎన్టీఆర్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాతో పాటు రాజకీయాలలో కూడా రాణించారు. రాజకీయాలలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఎంత గొప్పవో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్- బసవతారకంకి 7గురు అబ్బాయిలు, 4 గురు అమ్మాయిలు సంతానం అనే విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కొడుకులు అనగానే హరికృష్ణ, బాలకృష్ణ మాత్రమే గుర్తొస్తారు.. నిజానికి ఆయనకు ఎనిమిది మంది కొడుకులు, నలుగురు కూతుర్లు.
నందమూరి తారక రామారావు మొదటి కొడుకు పేరు నందమూరి రామకృష్ణ.. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణించాడు. రెండవ కుమారుడు నందమూరి జయకృష్ణ. ఇక మూడవ సంతానంగా దగ్గుబాటి పురందేశ్వరి జన్మించింది. ఇక నాల్గవ సంతానంగా నందమూరి సాయి కృష్ణ జన్మించారు. ఇక ఈయన కూడా మరణించారు. ఐదవ సంతానంగా నాలుగవ కొడుకుగా నందమూరి హరికృష్ణ జన్మించారు. ఈయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆరవ సంతానంగా ఐదో కుమారుడుగా నందమూరి మోహనకృష్ణ జన్మించారు. ఏడో సంతానంగా ఆరవ కొడుకు గా నందమూరి బాలకృష్ణ జన్మించారు. ఇక ఈయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అయితే తాజాగా బాలకృష్ణ పెళ్లికి సంబంధించిన విషయం ఒకటి వైరల్‌గా మారింది. 1982 వసుంధరతో బాలకృష్ణ వివాహం జరిగింది. అయితే ఎన్టీఆర్.. ఎన్నికల హడావిడిలో ఉన్న నేపథ్యంలో ఈ భారాన్ని తన సహచరుడైన నాదెండ్ల భాస్కర రావుకు అప్పగించాడట. భాస్కర రావు తన బంధువైన దేవరపల్లి సూర్యారావు కూతురైన వసుంధరను చూపించగా, ఆ అమ్మాయి అందరికీ నచ్చడంతో డిసెంబర్ 8, 1982 వసుంధరతో బాలకృష్ణ వివాహం జరిగింది. ఇక పెళ్లికి ఆయన కట్నం ఏం తీసుకోలేదట., పెళ్ళి కూతురి తండ్రి కూతురికి కానుకగా హైద్రాబాద్ లో 10 లక్షల రూపాయలతో ఇంటిని కట్టించారని అంటుంటారు. ఇక బాలకృష్ణ వసుంధరలకు ముగ్గురు సంతానం కాగా, వారికి కూతుళ్లు బ్రాహ్మణి, తేజస్విని, కొడుకు మోక్షజ్ఞ ఉన్నారు.