కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుని పోవలసిందే అనేది ఒక నానుడి. ప్రస్తుతం చిరంజీవి పరిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం స్వయం కృషిని నమ్ముకుని పైకొచ్చిన హీరోల్లో ఈయన పేరు మొదటి వరుసలో ఉంటుంది. ఎవరూ కాదనలేని నిజం ఇది.
కానీ ప్రతీ దానికి ఒక Expiry Date ఉంటుంది కదా. కాబట్టి చిరంజీవి కూడా గౌరవంగా పక్కకి తప్పుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన యాక్టింగ్ లో, డాన్స్ లో మునుపటి వేడి తగ్గింది. కథల సెలక్షన్ విషయంలో జరిగిన పొరపాట్ల వల్ల ఆయన రీసెంట్ మూవీస్ అన్నీ ఫ్లాప్ టాక్ ని మూటగట్టుకుంటున్నాయి.
ఉదాహరణకి సైరా, ఆచార్య, భోళా శంకర్. ఇకనైనా ఆయన మంచి స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకుని వస్తే ఇండస్ట్రీలో టాప్ హీరో అన్న పేరు అలాగే నిలబడుతుంది. లేదంటే ఆడియన్స్ లో ఇక చాలు పక్కకు తప్పుకోవయ్యా అని కఠినంగా చెప్పాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఏదేమైనా ఆయన మునుపటి ఫామ్ ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.