వినోదం

అత్తారింటికి దారేదిలో స‌మంతకు బ‌దులుగా ముందుగా హీరోయిన్ ను ఎవ‌రిని అనుకున్నారో తెలుసా..?

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌లో అత్తారింటికి దారేది ఒక‌టి. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది.బాహుబలి సినిమా కన్నా ముందు అత్యధిక వసూళ్లు చేసిన మూవీగా రికార్డు ఈ సినిమా పేరిట ఉండేది. విడుదలకు ముందే పైరసీ, ప్లాప్ టాక్ లను దాటుకుని వచ్చి సూప‌ర్‌ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కథను పవర్ స్టార్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కేవలం ఒక్క ఫోన్ కాల్ లోనే వినిపించ‌గా, ఆ స్టోరీ విని పవన్ త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. సినిమాలో అత్త క్యారెక్టర్ మెయిన్ రోల్ కావడంతో ఆ రోల్ లో ఎవరిని ఎంపిక చేశారని త్రివిక్రమ్ పవన్ అడిగారట.. నదియా అని చెప్పగానే కన్విన్స్ అయ్యారట.

సినిమాలో హంస నందిని ఇట్స్ టైం టూ పార్టీ నౌ.. అనే ఐటమ్ సాంగ్ లో స్టెప్పులు వేసి అల‌రించింది. ముందుగా ఈ ఆఫ‌ర్ మొదట అనసూయ కి వెళ్ళింది. కానీ అన‌సూయ రిజెక్ట్ చేయడంతో హంస‌నందినిని ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ముందుగా ఇలియానాను అనుకున్నారు. కానీ డేట్స్ సర్దుబాటు కాక‌పోవ‌డంతో సమంతను తీసుకున్నారు. ఈ సినిమాలో కొంత భాగం ఫారెన్ లో చిత్రీకరణ జర‌గ‌గా, లొకేషన్ లను స్వయంగా పవన్ కళ్యాణ్ వెతికారు.

do you know who is first choice as samantha replacement in attarintiki daredi

ఈ సినిమాలో నదియా పవన్ కళ్యాణ్ మధ్య ఉండే ఓ సీన్ కు పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించారు. సినిమాకి అన్నీ క‌లిసి రావ‌డంతో అవార్డుల పంట పండింది. . 61వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సినిమాకు 4 అవార్డులు వచ్చాయి.బెస్ట్ ఎంటర్ టైనర్, ఫిల్మ్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజికట్ డైరెక్టర్ అవార్డులను సొంతం చేసుకుంది. 2013 సైమాలో బెస్ట్ ఫిల్మ్, డైరెక్టర్,బెస్ట్ యాక్టరెస్, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ ఫైట్స్ విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. 2013లో 4 నంది అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టరెస్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ డైలాగ్ రైటర్ అవార్డులు వచ్చాయి. ఈ చిత్రం 187 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

Admin

Recent Posts