చిత్ర రంగంలో ప్రవేశించే హీరోలు మాత్రమే కాదు, వారి పేర్లు కూడా అందంగా ఉండాలి. అందుకే పుట్టినప్పుడు పెట్టే పేరుని నటిగా అడుగుపెట్టే ముందు మార్చుకోవడం సర్వసాధారణం అయిపోయింది. నేమ్ లో ఏముంది అనుకుంటాం కానీ, అసలు కథ అంతా పేరులోనే ఉంటుంది. కొనిదెల శివ శంకర వరప్రసాద్, పేరు వినగానే ఇట్టే గుర్తుపట్టేస్తారేమో కానీ, చిరంజీవి అని పిలవడం లోనే కిక్కు. చిరు మాత్రమే కాదు, మనకు తెలిసిన మరికొందరి స్టార్ హీరోల అసలు పేరు ఏంటో ఇప్పుడు చూద్దాం.
#ప్రభాస్ – ప్రభాస్ అసలు పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. #ధనుష్ – వెంకటేశ్ ప్రభు కస్తూరి రాజా, ఈ పేరు చెప్తే అసలు ఎవరికీ తెలియకపోవచ్చు. ధనుష్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేయొచ్చు. #సంపూర్ణేష్ బాబు – నటుడు సంపూర్ణేష్ బాబు, సంపు అసలు పేరు నరసింహ చారి. #యష్ – 2019లో బ్లాక్ బస్టర్ హిట్ అయినా కన్నడ డబ్బింగ్ చిత్రం కేజిఎఫ్ సినిమాలో హీరోగా నటించిన యష్, యష్ అనేది తెరపేరు మాత్రమే. అసలు పేరు నవీన్ కుమార్ గౌడ.
# నాని – నాని అసలు పేరు గంట నవీన్ బాబు. #విక్రమ్ – కెన్నెడీ జాన్ విక్టర్ అనేది అసలు పేరు అయినప్పటికీ విక్రమ్ లేదా చియాన్ విక్రమ్ గానే అందరికీ సుపరిచితుడు విక్రమ్. #రవితేజ – మాస్ మహారాజా రవితేజ అసలు పేరు రవిశంకర్ రాజు భూపతి రాజు. #సూర్య – శరవనన్ శివకుమార్, సూర్య అసలు పేరు ఇదే.