సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పాలి. ఇండస్ట్రీలో ఎదగాలి అంటే టాలెంట్ తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలి అని అంతా అంటుంటారు. అందుకే తమ సినిమాల విషయంలో హీరోయిన్లు ఎంతో జాగ్రత్త తీసుకుంటూ కొంతకాలం పాటు ఇండస్ట్రీలో మనుగడ కొనసాగిస్తూ ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్స్ మొదటి సినిమాతో విజయం వచ్చినా సరే ఆ తర్వాత మరొక సినిమాలో చేసి ఇండస్ట్రీకి దూరమయ్యారు. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్ల గురించి ఇప్పుడు చూద్దాం. బాలనటిగా మంచి పేరు సంపాదించి ఆ తర్వాత ఓయ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు.
రాధా కూతురిగా జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత దమ్ము సినిమా చేసిన కార్తీక ఇప్పుడు టీవీ రంగానికి పరిమితమైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన నేనింతే సినిమాతో హీరోయిన్ గా శియా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వేదం సినిమాలో కనిపించిన ఈమె మళ్లీ సినిమాలలో కనిపించలేదు. రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరుత సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా శర్మ ఆ తర్వాత చాన్సులు వచ్చినా సరే నిలబెట్టుకోలేకపోయింది.
అల్లు అర్జున్ తో బన్నీ సినిమాలో ఆడి పాడింది గౌరీ ముంజాల్. కానీ మళ్ళీ సినిమాలలో నటించలేదు. పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించిన మీరా చోప్రా ఈ సినిమా పరాజయం కావడంతో ఈమెను పక్కకు పెట్టేశారు. వీరితో పాటు అనురాధ మెహతా, భాను శ్రీ మెహ్ర, అన్షు, రీచా వంటి ఎంతో మంది హీరోయిన్లు మొదటి సినిమాతో గుర్తింపు తెచ్చుకొని తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు.