వినోదం

Chiranjeevi : చిరంజీవికి మెగాస్టార్ అన్న బిరుదు ఎలా వ‌చ్చింది ? ఎవ‌రు ఇచ్చారో తెలుసా ?

Chiranjeevi : స్వ‌యంకృషితో ఉన్నత స్థానంలో నిలిచిన చిరంజీవి ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నాడు. ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి మెగాస్టార్‌గా ఎదిగి తెలుగు వారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు చిరంజీవి. పునాది రాళ్లుతో నటుడిగా పరిచయం అయినా.. మొదట రిలీజ్ అయ్యింది మాత్రం ప్రాణం ఖరీదు సినిమానే. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా స్వశక్తితో ఎదిగిన చిరంజీవి జీవితం ఎందరికో ఆదర్శం. ఆయన్ని స్పూర్తిగా తీసుకుని నటులైన వారు చాలామందే ఉన్నారు. స్టైల్, మేనరిజమ్, మాస్ ఆడియెన్స్‌ను మెప్పించడం, జానర్ ఏదైనా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి తన నటనతో నిండుదనం తీసుకురావడం ఒక్క చిరంజీవికే సాధ్యం.

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు తర్వాత స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన నటుడు చిరంజీవి. అప్పటికే ఎంతో మంది హీరోలున్నా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకొని మెగాస్టార్‌గా ఎదిగారు. ఇక చిరంజీవికి మెగాస్టార్‌ అనే బిరుదును ప్రదానం ఎవరు చేశారనే విష‌యం చాలా మందికి తెలియ‌దు. టాలీవుడ్‌లో చిరంజీవిని మెగాస్టార్‌ను చేసిన నిర్మాత కె.ఎస్.రామారావు. ఈయన తన క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌లో చిరంజీవితో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు.

do you know how Chiranjeevi got mega star name

చిరంజీవి, నిర్మాత కె.ఎస్.రామారావు కలయికలో వచ్చిన తొలి చిత్రం అభిలాష. యండమూరి వీరేంద్రనాథ్ నవల‌ ఆధారంగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అభిలాష సినిమా టాలీవుడ్‌లో సూపర్ హిట్‌‌గా నిలిచింది. ఈ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఛాలెంజ్ చిత్రం కూడా మంచి విజ‌యం సాధించింది. రాక్ష‌సుడు, మ‌ర‌ణ మృదంగం సినిమాలు కూడా మంచి విజ‌యాలు సాధించాయి. మ‌ర‌ణ మృదంగం చిత్రంతోనే అప్పటి వరకు సుప్రీం హీరో బిరుదుతో వస్తున్న చిరంజీవి ముందు మెగాస్టార్ బిరుదు వ‌చ్చి చేరింది. అలా చిరంజీవి ఫ్యామిలీ.. మెగా ఫ్యామిలీగా మారడం వెనుక ఉన్న అసలు వ్యక్తి కేఎస్ రామారావు అనే చెప్పాలి.

Admin

Recent Posts