వినోదం

హిట్ అయిన సినిమాల్లో మంచి పాత్రలను వదులుకున్న 10 మంది స్టార్లు వీళ్లే!

ఇండస్ట్రీలో ఒక హీరోకి అనుకున్న కథ , ఇంకో హీరోకి వెళ్తుంది. ఒకరికి ఫిక్స్ అయిన క్యారెక్టర్ ఇంకొకరికి వెళుతుంది. షెడ్యూల్స్ కుదరకపోవడం, క్యారెక్టర్ నచ్చకపోవటం, ఆ క్యారెక్టర్ కి నేను ఫిట్ అవ్వను, అనుకోవడమే లేదా రెమ్యూనరేషన్ లాంటి వివిధ కారణాల వల్ల కొందరు కొన్ని క్యారెక్టర్స్ ని రిజెక్ట్ చేస్తున్నారు. ఇలా తెలుగు సినిమాల్లో మంచి మంచి పాత్రలు మిస్ చేసుకున్న వారిలో ఏ ఏ స్టార్స్ ఉన్నారో ఒకసారి చూసేద్దాం.

do you know that these actors rejected those movies

#1 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో రేలంగి మావయ్య పాత్రను రజినీకాంత్ తిరస్కరించారు.

#2 రంగస్థలంలో రంగమ్మత్త పాత్రను రాశి రిజెక్ట్ చేసింది.

#3 బాహుబలిలో శివగామి పాత్రను దివంగత శ్రీదేవి తిరస్కరించారు.

#4 అరవింద సమేత లో జగపతిబాబు భార్య పాత్రను లయ తిరస్కరించింది.

#5 జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ పాత్రను బాలకృష్ణ తిరస్కరించారు.

#6 ఆగడులో సోను సూద్ పాత్రను ప్రకాష్ రాజ్ తిరస్కరించాడు.

#7 గోవిందుడు అందరివాడేలే లో ప్రకాష్ రాజ్ పాత్రను తమిళ నటుడు రాజ్ కిరణ్ తిరస్కరించారు.

#8 నాన్నకు ప్రేమతో సినిమాలో జగపతిబాబు పాత్రను అరవింద్ స్వామి తిరస్కరించారు.

#9 రంగస్థలంలో ప్రెసిడెంట్ గారు (జగపతిబాబు) పాత్రను రాజశేఖర్ తిరస్కరించారు.

#10 పద్మావతిలో షాహిద్ కపూర్ పాత్రను ప్రభాస్ తిరస్కరించారు.

Admin

Recent Posts