సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో సక్సెస్ అవ్వాలంటే టాలెంట్ తో పాటుగా కాస్త లక్ కూడా ఉండాలి. ఇండస్ట్రీలో ఎంత కష్టపడితే అన్ని ఆఫర్ లు తన్నుకు వస్తాయి. ఈ విధంగా కెరియర్ లో సక్సెస్ అవుతూ పైకి ఎదుగుతున్న తరుణంలోనే 30 ఏళ్లలోపే పలువురు యంగ్ స్టార్లు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. వారెవరో ఓ లుక్కేద్దాం..!
సౌందర్య:
ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సౌందర్య ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. తన కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలో 31 ఏళ్ల లోనే విమాన ప్రమాదంలో కన్నుమూశారు.
ఉదయ్ కిరణ్:
ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే తన టాలెంట్ తో స్టార్డమ్ సంపాదించాడు. ఎదుగుతున్న సమయంలోనే సినిమా ఆఫర్లు రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లి 33 ఏళ్లకే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
దివ్యభారతి :
అతి చిన్న వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కేవలం 18 సంవత్సరాల లోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. కెరియర్ మంచి పొజిషన్ లో ఉన్నప్పుడే భవనంపై నుంచి కింద పడి కన్నుమూసింది.
యశో సాగర్ :
ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న సాగర్, కారు ఆక్సిడెంట్ లో 27 ఏళ్ళ వయసులోనే మరణించారు.
ఆర్తి అగర్వాల్ :
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆర్తి అగర్వాల్, బరువు తగ్గేందుకు సర్జరీ చేయించుకుని అది వికటించడంతో చిన్న వయసులోనే లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
ప్రత్యూష :
తన అందంతో ఎంతోమందిని ఆకట్టుకున్న అందాల తార ప్రత్యూష కూడా 27 సంవత్సరాల వయసులోనే సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.