సినిమా ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ అంటే తెలియని వారు ఉండరు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే నైజం వెంకటేష్ సొంతం. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతాడు వెంకీ.. ఇప్పటికి ఒక కుర్ర హీరో లాగే అందరినీ అలరిస్తూ ఉంటాడు. ఆయన సినిమాలు ఏవైనా సరే పెద్దగా హంగు ఆర్భాటాలు లేకుండా చాలా ఈజీగా జనాలకి కనెక్ట్ అవుతాయి..
ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేని హీరో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన వెంకటేష్ మాత్రమే అని చెప్పవచ్చు. అలాంటి వెంకటేష్ ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఏళ్లు అవుతోంది.ఈ స్టార్ హీరో తన సినిమాలతో ఎంతో మంది కొత్త హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేశారు. మరి ఆ హీరోయిన్స్ ఎవరు.. ఆ సినిమాలు ఏంటో మనము ఒక లుక్కేద్దాం..
కుష్బు : కలియుగ పాండవులు సినిమా ద్వారా కుష్బూను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. దివ్యభారతి: బొబ్బిలి రాజా సినిమా ద్వారా దివ్యభారతి తెలుగు ఇండస్ట్రీ లో తెరంగేట్రం చేశారు. టబు: కూలి నెంబర్ వన్ సినిమా ద్వారా టబు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. అపర్ణ- సుందరకాండ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. ప్రతిభా సిన్హా – పోకిరి రాజా, ప్రేమ – ధర్మచక్రం, శిల్పా శెట్టి – సాహస వీరుడు సాగర కన్య, వినీత – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, అంజలా జవేరి – ప్రేమించుకుందాం రా, ప్రీతిజింతా – ప్రేమంటే ఇదేరా సినిమాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక వీరే కాకుండా చాలామంది కొత్త హీరోయిన్స్ వెంకటేష్ ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమై స్టార్ హీరోయిన్స్ గా ఎదిగారు.