తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంటెడ్ నటులు ఉన్నారు.. కొంతమంది నటులు ఏ పాత్ర ఇచ్చినా కానీ దానిలో నటించడమే కాకుండా జీవించేస్తారు.. ఈ విధంగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవైపు విలన్లుగా మరోవైపు కమెడియన్లుగా చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.. మరి వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేకమైన గౌరవాన్ని సంపాదించుకున్నారు. కోట శ్రీనివాసరావు కామెడీ పాత్రలు, విలన్ పాత్రలు ఎక్కువగా చేశారు.
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో విలన్ పాత్రలు చేసిన రావు గోపాల్ రావు చాలా సినిమాల్లో కామెడీ రోల్స్ లో కూడా నటించి మెప్పించారు . జయప్రకాష్ రెడ్డి.. ఇండస్ట్రీలో ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఫ్యాక్షనిస్ట్ పాత్రల్లో, కామెడీ రోల్స్ పోషించడంలో దిట్ట.. రఘు బాబు.. ఈయన కూడా అనేక సినిమాల్లో కామెడీ రోల్స్ మాత్రమే కాకుండా విలన్ గా కూడా మెప్పించారు. రాహుల్ దేవ్.. ఈ నటుడు కూడా చాలా సినిమాల్లో విలన్ గా చేయడమే కాకుండా కమెడియన్ గా కూడా చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు.
పరేష్ రావెల్.. ఓ వైపు కామెడీ రోల్ చేస్తూనే మరోవైపు విలన్ గా మెప్పించిన నటుడు. శంకర్ దాదా ఎం బి బి ఎస్ సినిమా లో చిరంజీవి మామ పాత్రలో ఆయన నటన అమోఘం.. అలాగే వెంకటేష్‌తో చేసిన క్షణ క్షణం మూవీలో విలన్ పాత్ర చేస్తూనే కామెడీని సైతం పండించారు.