సాధారణంగా సినిమా ఇండస్ట్రీల్లో హీరో,హీరోయిన్ల విషయంలో అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సినిమాలో ముందుగా దర్శక నిర్మాతలు ఫలానా హీరో, ఫలానా హీరోయిన్ అని ఎంపిక చేసుకుంటారు.. కానీ ఒక్కోసారి ఆ హీరో, హీరోయిన్లకు డేట్లు కుదరక, లేదంటే మరేదైనా కారణంతో చివరి సమయంలో తప్పుకుంటారు.. ఈ విధంగా ముందుగా ఈ సినిమాలో ఈ తొమ్మిది మంది హీరోయిన్లను అనుకొని, చివరికి ఆ సినిమాల్లో వేరే హీరోయిన్లను తీసుకున్నారు.. మరి ఆ సినిమాలు ఏంటో వారు ఎవరో ఒకసారి చూద్దాం..
సీతారామం: ఈ సినిమాలో ముందుగా పూజా హెగ్డే ను కథానాయిక అనుకున్నారట.. కానీ చివరికి మృణాల్ ఠాకూర్ ని ఎంపిక చేశారు.. సినిమా సూపర్ హిట్ అయింది. శ్యామ్ సింగరాయ్ : ఈ మూవీలో ముందుగా రష్మిక మందన్న అనుకున్నారట. కానీ చివరగా సాయి పల్లవికి దక్కింది. డియర్ కామ్రేడ్ : ఈ మూవిలో ముందుగా సాయి పల్లవి అనుకున్నారట, కానీ చివరికి ఈ పాత్ర రష్మికా కు వెళ్లిపోయింది.
రంగస్థలం : ఈచిత్రంలో మొదటగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ అనుకున్నారు. కానీ చివరి సమయంలో సమంతకు ఈ ఛాన్స్ దక్కింది. గీత గోవిందం : ఈ మూవీలో ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ అనుకున్నారు.. కానీ చివరికి ఈ పాత్ర రష్మికాకి వెళ్ళింది. మహానటి : ఇందులో మొదటి ఎంపికగా నిత్యామీనన్, కానీ చివరికి ఈ పాత కీర్తి సురేష్ కు దక్కింది. నారప్ప : ఈ మూవీలో ముందుగా అనుష్కను తీసుకుందామని అనుకున్నారట, కానీ ఏవో కారణాల వల్ల ఈ పాత్ర ప్రియమణికి వెళ్ళింది. పుష్ప పార్ట్1: ఈ మూవీలో ముందుగా హీరోయిన్ గా సమంత అనుకున్నారట.. కానీ చివరికి ఈ పాత్ర రష్మికా కు వెళ్లి సూపర్హిట్ అయింది..