Johnny : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటుడిగానే కాదు దర్శకుడిగాను ప్రయోగాలు చేసిన విషయం తెలిసిందే. ఆయన తెరకెక్కించిన జానీ చిత్రం 2003 ఏప్రిల్ 25న 250 ప్రింట్లతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. రేణూ దేశాయ్ ఇందులో కథానాయికగా నటించగా, ఈ చిత్రం దారుణమైన ఫ్లాప్‌ని మూటగట్టుకుంది. అయితే ఈ సినిమాకి హైప్ మాత్రం బాగానే దక్కింది. సినిమా విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ స్టైల్‌ని చాలా మంది అనుకరించారు. అయితే ఈ సినిమా కోసం పవన్ ఎంతగానో కష్టపడగా, ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ కావడంతో చాలా నిరాశ చెందాడు.
జానీ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఏడు ప్రయోగాలు చేశారు. మొదటిది ఏంటంటే ఆయన ఈ సినిమాలోని ఫైట్స్ కోసం లాస్ ఏంజిల్స్ లో , ఐక్విడోను జపాన్ లో మార్షల్ ఆర్ట్స్ ని ప్రత్యేకంగా నేర్చుకున్నారు. ఇక ఈ సినిమాకి ప్రత్యేక హెయిర్ స్టైల్ ఉండాలని, గుండు కొట్టించుకొని దానికి అనుగుణంగా జుట్టు పెంచాడు. ఈ సినిమాను 90 శాతం వాయిస్ లైవ్ రికార్డింగ్ చేశారు. నాయిస్ ఎక్కువగా ఉన్న పార్ట్స్ కు మాత్రమే డబ్బింగ్ చెప్పించారు. ఈ సినిమాలోని రెండు పాటలను పవన్ కళ్యాణ్ స్వయంగా పాడారు.
జానీ సినిమా కోసం పవన్ మొదట స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు హీరో చనిపోతాడు. కానీ తన అభిమానులు ఈ సీన్ ను యాక్సెప్ట్ చేయరని మళ్లీ స్క్రిప్ట్ మార్చాడు. ఇక ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆడకపోవడంతో తాను తీసుకున్న రెమ్మ్యునరేషన్ ను పవన్ నిర్మాతలకు తిరిగి ఇచ్చేశాడు. పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం వీరిద్దరి ప్రేమ గుర్తుగా మిగిలింది. ఈ సినిమా చాలామందికి ఇప్పటికీ టీవీలో వస్తే చూస్తుంటారు కానీ అప్పట్లో థియేటర్లో మాత్రం హిట్ అవ్వలేకపోయింది.