వినోదం

ఎన్టీఆర్ కు ఇష్టమైన పవన్ కళ్యాణ్ మూవీ ఇదే?

జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి చెందిన వాడు అనే విషయం మనందరికీ తెలుసు. కాగా, ఆయనకు మొట్టమొదట పెట్టిన పేరు నందమూరి తారక రామారావు కాదట. ఆయన ముందుగా ఆయన తండ్రి హరికృష్ణ ముందుగా తారక్ రామ్ అని పేరు పెట్టారట. అయితే ఆయనకు ఎనిమిదేళ్ల వయసులో వారి తాతగారు తారక రామారావు అని పేరు మార్చారట.

ఆ తర్వాత వీరిద్దరూ కలిసి బ్రహ్మశ్రీ విశ్వామిత్ర అనే సినిమాలో కలిసి నటించారు. తొలిసారి, తెరపై ఎన్టీఆర్ కనిపించింది అప్పుడే. ఆ సినిమాతో బాల నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఎన్టీఆర్ డాన్స్ ఎలా ఇరగదీస్తాడో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆయన అంత బాగా డాన్స్ చేయడానికి వాళ్ళ అమ్మ కారణం. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ బలవంతంగా ఆయనకు కూచిపూడి నేర్పించారట. దాని ఫలితమే ఆయన ఇప్పుడు గొప్ప డాన్సర్ కాగలిగారు.

do you know which pawan kalyan film jr ntr likes

ఎన్టీఆర్ తనకు పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ చిత్రం అంటే చాలా ఇష్టమని గ‌తంలో చెప్పారు. 1998 లో రిలీజ్ అయిన తొలిప్రేమ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది. స్వచ్ఛమైన ప్రేమ కథాంశం తో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిప్రేమ చిత్రం అంటే ఇష్టమని చెప్పడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తెగ సంబరపడిపోయారు. కాగా, ఎన్టీఆర్ ఇటీవల నటించిన దేవ‌ర‌ సినిమా బంపర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

Admin

Recent Posts