సామాజిక మాధ్యమాల్లో సినిమాల్లోని సీన్లపై ట్రోల్స్ రావడం సహజమే. ఈ క్రమంలోనే అతడు సినిమాపై అలాంటి మీమ్స్ వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2005లో విడుదలైన ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా, త్రిష కథానాయికగా నటించారు. ఈ చిత్రం మూడు నంది పురస్కారాలు, ఉత్తమ దర్శకుడి విభాగంలో దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారం సైతం గెలుచుకుంది.
అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన మహేష్ బాబు ట్రైన్ లో వెళుతుండగా చాలా ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలిసేందుకు వెళుతున్న పార్ధు బుల్లెట్ తగిలి చనిపోతాడు. కానీ ఆ బుల్లెట్ ను కాల్చింది మహేష్ బాబు కోసం. ఇక పార్ధు చెప్పిన వివరాలతో అతని ఇంటికి వెళ్లిన తరువాత వాళ్లంతా మహేష్ బాబుని పార్ధు అని అనుకోవడంతో సైలెంట్ గా ఉండిపోతాడు.
ఆ తర్వాత పార్ధులానే జీవిస్తాడు. కానీ చివరికి నిజం తెలిసిన తర్వాత అబద్ధం మాత్రమే చెప్పానని.. మోసం చేయలేదని అంటాడు. కాగా పార్ధు చనిపోయింది నీవల్లే, మోసం చేశావు నువ్వు..? పూరి వాళ్ళ అక్కకు వైయస్సార్ కానుకలా డబ్బులు ఇచ్చి పూరీని వలలో వేసుకున్నావు… నువ్వే పార్ధు అని చెప్పి మోసం చేశావు అంటూ లాజిక్ వెతికి మరి ట్రోల్ చేస్తున్నారు మీమర్స్.