హీరో కంటే విలన్ నచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి కానీ నేను రెండు సినిమాలు ఎంచుకుంటాను.నేను పృథ్విరాజ్ సుకుమారన్ ఫ్యాన్ ని కాబట్టి ఆయన సినిమానే ఎంచుకుంటాను. కనా కండేన్ (తమిళ్).. ఈ సినిమాలో మలయాళం లో పెద్ద స్టార్ హీరో అయిన పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ గా నటించారు.ఆయన విలన్ గా, హీరోగా చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో ఆయన పాత్ర ఒక మంచివాడిగా మొదలవుతుంది ఆ తర్వాత హీరో హీరోయిన్ ని నెమ్మదిగా మోసగించడం మొదలుపెడతాడు. వాళ్ళకి ఆయన ఒక ఫ్రాడ్ అని అర్థంఅవుతుంది. అని సినిమాలో చూపించినట్లు విలన్ పెద్ద కళ్ళు పెట్టి భయపెట్టటం అలా ఏమీ ఉండదు, ఒక సాధారణమైన పాత్ర. పృథ్విరాజ్ ఈ సినిమాలో విలన్ గా అదరగొట్టేశాడు.
ఈ సినిమా తన మొదటి తమిళ చిత్రం. అప్పుడు ఆయన వయస్సు 23. దీని తర్వాత ఆయనకి తమిళ్ సినిమా వాళ్ళు పెద్ద ఫ్యాన్ అయ్యారు, ఆయనకి తమిళ్ సినిమాలో ఎన్నో అవకాశాలు వచ్చాయి. కావియ తలైవన్ (తమిళం). ఇందులో కూడా పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ గా నటించారు.ఈ సినిమా ఫ్లాప్ అయింది కానీ ఈ సినిమాకి పృథ్విరాజ్ సుకుమారన్ కి బెస్ట్ విలన్ గా అవార్డ్ వచ్చింది. ఈ సినిమాలో ఆయనకి హీరో అంటే ఇష్టం ఉండదు. హీరో మీద జలసీ. సాధారణంగా హీరో విలన్ కంటే ముందు చావడం అనేది జరగదు కానీ ఈ సినిమాలో అలాగే జరిగింది.
సిద్ధార్థ్ ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు: సిద్ధార్థ్ లేకుండా ఈ సినిమా బాగుంటుంది కానీ పృథ్విరాజ్ లేకుండా సినిమా బాగుండదు. అంత గొప్ప నటుడు ఆయన. నేను అతనితో పోటీ పడలేకపోయాను.. అన్నాడు. ఈ రెండు సినిమాలు చూశాక సెల్యులాయిడ్ అనే మలయాళం సినిమా చూస్తే ఒక వేరే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో ఆయన హీరోగా నటించారు. పృథ్విరాజ్ నిజంగా ఒక గొప్ప నటుడు. విలన్ గా అయినా హీరో గా అయినా అదరగొట్టేస్తాడు.