స్నానం చేసేటప్పుడు చన్నీళ్ళు మొదటగా కాళ్ళు, చేతులు, తల , భుజాలు మీద కాకుండా బొడ్డు మీద ఒక నిమిషం పాటు పోసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది (బొడ్డు కింద అరచెయ్యి పెట్టి). సాధారణంగా వృద్ధుల్లో బాత్రూం లో హార్ట్ ఎటాక్స్ లాంటివి వస్తుంటాయి ఇలా స్నానం చేయటం వల్ల అలా జరిగే అవకాశం పెద్దగా ఉండదు. కొందరికి bp అమాంతం పెరుగుతుంది, కొందరికి పక్షవాతం కూడా వస్తుంది. కాళ్ళ మీద, చేతుల మీదు నీళ్లు పోసినప్పుడు ఆ అంగం మటుకే చల్లగా వుంటుంది, మిగతా ప్రాంతం సాధారణ స్థితి ఉంటుంది. చన్నీళ్ళ స్నానంకి మాత్రమే కాదు వేన్నీళ్ల స్నానానికి కూడా ఇది వర్తిస్తుంది. చన్నీటి స్నానం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
నిజానికి కరెక్ట్ గా స్నానం చేసే విధానం ఇది (ముఖ్యంగా బీపీ ఉన్నవారికి). బొడ్డు మీద మొదటగా నీరు ధారాళంగా 30 సెకండ్స్/ 1 నిమిషం పాటు పోయాలి. బొడ్డు దగ్గర 72000 నాడులు అనుసంధానం అయి ఉండటం చేత వెచ్చ గా వుండటం జరుగుతుంది . ఇది సైన్స్ కి సంబంధించిన అంశం. రక్త ప్రసరణ మెరుగవుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది ఇంకా చాలా ఫలితాలు ఉంటాయి. స్నానం చేయటం వల్ల మానసిక స్థితి వెంటనే మెరుగవుతుంది. ఇది ఆయుర్వేదంలో ఒక ఆరోగ్యం సూత్రంగా పరిగణిస్తారు.
కొందరు వృద్దులు రాత్రిపూట nature calls అటెండ్ అయేటప్పుడు నిద్ర లేస్తూనే వెళ్ళతారు. ఇది చాలా ప్రమాదకరం. దానికి బదులు ఒక 2 నిమిషాలు పాటు స్థిమితంగా కూర్చొని కళ్ళు తడుముకుని మెళకువతో నిదానంగా వెళ్ళాలి.