Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

అంధుడిగా న‌టించ‌నున్న రామ్ చ‌రణ్‌..?

Admin by Admin
April 18, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మన టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో ఛాలెంజింగ్ రోల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. మామూలు క్యారక్టర్ రోల్స్ లో కంటే ఆయన ఛాలెంజింగ్ రోల్స్ లో రెచ్చిపోయి మరీ నటిస్తున్నాడు. ఎక్కడా కూడా ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపించదు. చాలా సహజంగా నటిస్తున్నట్టు ఉంటుంది. అందుకు ఉదాహరణగా నిల్చింది రంగస్థలం చిత్రం. ఇందులో ఆయన చెవులు స‌మ‌స్య ఉన్న‌ట్లుగా ఎంత సహజంగా నటించాడో మన అందరికీ తెలిసిందే. ఇప్పటికీ యాక్టింగ్ గురించి ప్రస్తావన వస్తే రంగస్థలం లో రామ్ చరణ్ రేంజ్ లో నటించాడు అని పోలుస్తూ మాట్లాడుతారు. అంత అద్భుతంగా నటించాడు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం విడుదల అవ్వలేదు కానీ, అయ్యి ఉంటే నేషనల్ అవార్డు కూడా వచ్చేదని విశ్లేషకుల అభిప్రాయం.

రంగస్థలం తర్వాత వచ్చిన RRR లో కూడా ఆయన వివిధ షేడ్స్ లో చాలా సహజంగా నటించి శభాష్ అనిపించుకున్నాడు. ఇక రీసెంట్ గా విడుదలైన గేమ్ చేంజర్ చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ లో అప్పన్న క్యారక్టర్ ని ఎంత అద్భుతంగా పోషించాడో మనమంతా చూసాము. ఈ క్యారక్టర్ లో ఆయన మాట‌లు మాట్లాడ‌డంలో ఇబ్బంది పడిన వాడిగా చాలా సహజంగా నటించాడు. ఆయన నటిస్తున్నంతసేపు అలా చూస్తూ ఉండిపోవాలని అనిపించింది. ఈ క్యారక్టర్ ని సెకండ్ హాఫ్ లో కాస్త పెంచి ఉండుంటే బాక్స్ ఆఫీస్ వద్ద అలాంటి డిజాస్టర్ ఫలితాన్ని అందుకునేది కాదు. రామ్ చరణ్ ఈ క్యారక్టర్ లో నటించలేదు, జీవించాడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చి బాబు తో రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ram charan to act as blind

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది. ఇందులో రామ్ చరణ్ క్యారక్టర్ గురించి ఒక షాకింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అదేమిటంటే ఇందులో రామ్ చరణ్ అంధుడిగా నటిస్తున్నాడట. అంధుడు అయినప్పటికీ ఆటల్లో అతని ఊరిలోనే మొనగాడు అని, ఏ ఆటలో అయినా అతన్ని ఓడించేవారు లేరని తెలుస్తుంది. ఈ క్యారక్టర్ ద్వారా అనేక ఎమోషన్స్ ని పలికించేలా డైరెక్టర్ బుచ్చి బాబు స్క్రిప్ట్ ని రాసుకున్నాడట. రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని ఈ చిత్రంలో చూడొచ్చని అంటున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి, ఈ అక్టోబర్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ కం బ్యాక్ ఇస్తే ఏ రేంజ్ లో ఉంటుందో గతంలో మనమంతా చూసాము. ఇప్పుడు మరోసారి చూడబోతున్నాము అంటూ ఈ చిత్రానికి సంబంధించిన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.

Tags: Ram Charan
Previous Post

అత‌ను కాలంలో ప్ర‌యాణించి వ‌చ్చాడ‌ట‌… 5000వ సంవ‌త్స‌రంలో ప్రపంచం ఇలా ఉంటుంది అంట..

Next Post

విమానంలో మ‌ద్యం సేవించ‌మ‌ని అడిగిన ఎయిర్ హోస్టెస్‌కు దిమ్మ తిరిగే స‌మాధానం ఇచ్చిన ప్ర‌యాణికుడు

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!