వినోదం

Jabardasth Naresh : జ‌బ‌ర్ద‌స్త్ న‌రేష్ అస‌లు వ‌య‌స్సు ఎంతో తెలుసా ? ఆయ‌న గురించి తెలిస్తే బాధ‌ప‌డ‌తారు..!

Jabardasth Naresh : బుల్లితెర‌పై ఎంతో స‌క్సెస్ అయిన జ‌బ‌ర్ద‌స్త్ షో గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇందులో చాలా మంది క‌మెడియ‌న్లు త‌మ స‌త్తా చాటారు. కొంద‌రు సినిమాల్లోనూ చాన్స్‌ల‌ను ద‌క్కించుకుంటున్నారు. ఇక కొంద‌రు ఈ షో ద్వారా బాగా పాపుల‌ర్ అయ్యారు. అలాంటి క‌మెడియ‌న్ల‌లో న‌రేష్ ఒక‌రు. ఈయ‌న చేసే కామెడీ అద్భుతంగా ఉంటుంది. ఈయ‌న కామెడీ టైమింగ్‌తోపాటు పంచ్‌ల‌కు ప్రేక్ష‌కులు ఫిదా అవుతుంటారు. ఈ క్ర‌మంలోనే న‌రేష్ చేసే కామెడీ అద్భుతంగా ఉంటుంది. ప్రేక్ష‌కులు ఈయ‌న‌ను ఎంత‌గానో ఇష్ట‌ప‌డతారు.

అయితే న‌రేష్ జ‌బ‌ర్ద‌స్త్‌లో బుల్లెట్ భాస్క‌ర్ టీమ్‌లో చేస్తాడ‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే భాస్క‌ర్ ఇటీవ‌లే ఓ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. అందులోనూ న‌రేష్ గురించి ప‌లు ముఖ్య‌మైన విష‌యాల‌ను భాస్క‌ర్ తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ న‌రేష్‌కు ఏది చెప్పినా ఇట్టే గ్ర‌హించేస్తాడ‌ని.. ఒక్క సారి చెప్ప‌గానే స్కిట్ మొత్తాన్ని గుర్తు పెట్టుకుని మ‌రీ అదేవిధంగా యాక్ట్ చేస్తాడ‌ని.. అలాగే అద్భుతంగా కామెడీని పండిస్తాడ‌ని భాస్క‌ర్ తెలిపారు.

jabardasth naresh original age

కాగా న‌రేష్‌ది తెలంగాణ‌లోని వ‌రంగల్ జిల్లా జ‌న‌గామ‌కు స‌మీపంలో ఉన్న అనంత‌పురం అనే గ్రామం. అయితే న‌రేష్‌కు పుట్టుక‌తోనే ఎదుగుద‌ల లోపం అనే స‌మ‌స్య వ‌చ్చింది. దీంతో ఆయ‌న అంద‌రిలా ఎత్తు పెర‌గ‌లేక‌పోయారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు 20 ఏళ్ల‌కు పైగానే ఉన్నా చిన్న పిల్లాడిలా క‌నిపిస్తారు. అయితే న‌రేష్‌కు జ‌బ‌ర్ద‌స్త్‌లో అదే ప్ల‌స్ అయింది. అటు పెద్ద‌ల పాత్ర‌లో.. ఇటు పిల్ల‌ల పాత్ర‌లోనూ.. మెప్పించ‌గ‌ల‌డు. క‌నుక‌నే అవే పాత్ర‌లు చేస్తూ న‌రేష్ అల‌రిస్తున్నాడు.

అయితే న‌రేష్ కు డ్యాన్స్ అంటే బాగా ఇష్టం. దీంతో ఢీ షోకు సెలెక్ట్ అయ్యాడు. త‌రువాత అన్న‌పూర్ణ స్టూడియో గేటు వ‌ద్ద సునామీ సుధాక‌ర్ చూసి వెంట‌నే న‌రేష్‌ను జ‌బ‌ర్ద‌స్త్‌లోకి తీసుకునేలా చేశాడు. దీంతో మొద‌ట చ‌లాకి చంటి టీమ్‌లో జాయిన్ అయ్యాడు. త‌రువాత భాస్క‌ర్ టీమ్‌లోకి న‌రేష్ వ‌చ్చేశాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలుసు. త‌న కామెడీతో అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు. ఇక న‌రేష్ జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా బాగానే సంపాదించాడు. సొంత ఊళ్లో ఇల్లు క‌ట్టించ‌డంతోపాటు హైద‌రాబాద్‌లోనూ ఫ్లాట్‌ను తీసుకున్నాడు.

అయితే న‌రేష్‌కు ఉన్న ఎదుగుద‌ల లోపం అన్న వ్యాధిని న‌యం చేయ‌వ‌చ్చ‌ట. కానీ అది చాలా ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. అంత‌టి రిస్క్ చేసినా ప్రాణాల‌కు ప్ర‌మాదం ఏర్ప‌డుతుంద‌ట‌. క‌నుక న‌రేష్ అలాగే ఉండిపోయాడు. బ‌య‌టికి ప్రేక్ష‌కుల‌ను న‌రేష్ ఎంత‌గా న‌వ్వించినా.. త‌న జీవితంలో ఇంతటి విషాదం దాగి ఉంద‌ని మాత్రం ఎవ‌రికీ తెలియ‌దు. అయిన‌ప్ప‌టికీ అవేవీ బ‌య‌ట‌కు క‌న‌బ‌డ‌నీయ‌కుండా న‌రేష్ చేసే కామెడీ అద్భుత‌మ‌నే చెప్పాలి.

Admin

Recent Posts