వినోదం

Jagapathi Babu : జ‌గ‌ప‌తిబాబు రూ.1000 కోట్ల ఆస్తుల‌ను పోగొట్టుకున్నాడా.. ఎందుకు..? అస‌లు ఏమైంది..?

Jagapathi Babu : ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన హీరో జ‌గ‌ప‌తి బాబు. ఒక‌ప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన జ‌గ‌ప‌తి బాబు ఒకానొక సమయంలో మాత్రం చాలా దీన పరిస్థితిలో కూడా ఉన్నాడు. బ్యాంక్ ఎకౌంట్ లో రూపాయి లేని రోజును చూశాడు. అలాంటి జగపతిబాబు ఇప్పుడు నెగిటివ్ పాత్రలతో మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా ఆయ‌న త‌న జీవితానికి సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

ఓ హీరో తో సినిమా చేస్తున్నప్పుడు సెట్‌లో సరిగ్గా భోజనం కూడా పెట్టలేదు అని చెప్పాడు జ‌గ‌ప‌తిబాబు .. గౌరవం కూడా ఇవ్వని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక లైట్ మ్యాన్ వచ్చి అయితే నా కాళ్ళ దగ్గర కూర్చొని కూడా ఆ పరిస్థితిని చూసి ఏడ్చాడు. ఆ విధమైన ఎన్నో చేదు అనుభవాలను నేను ఎదుర్కొన్నాను. మొదట్లో అలాంటి మూమెంట్స్ అంటే ఏమిటో నాకు తెలియలేదు. కానీ అలాంటి బాధలు ఎదురైనప్పుడు మాత్రం అదొక లెర్నింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ అని ఆయ‌న అన్నాడు. ఆస్తుల గురించి అయితే నేను పెద్దగా పట్టించుకోను డబ్బు అనేది మనిషికి ఒక జబ్బు లాంటిది. ఒక పరిధి వరకు సంపాదించుకోగలిగితే బాగుంటుంది కానీ.. అది లిమిట్ దాటితే టెన్షన్ తప్ప మ‌రొక‌టి ఉండదు అని ఆయ‌న చెప్పుకొచ్చారు.

jagapathi babu lost rs 1000 crores of wealth know why

నేను సంపాదించిన ఆస్తుల విలువ ఇప్పుడు 100‌0 కోట్లకు పైగానే ఉంటుంది. అయితే, అంతలా ఆస్తులు పోగొట్టుకోవడానికి కారణం ఏంటనేది ఇప్ప‌టికీ ప్ర‌శ్న‌గానే మారింది. క్యాసినోతో ఆస్తులు పోలేదు. నేను సరదాకు మాత్రమే అవి ఆడతాను. అంత డబ్బు ఎలా పోయిందనే దానికి క్లారిటీ లేదు. ఒకరిని బ్లేమ్ చేయను .. చెప్పాలంటే చాలా మందే ఉన్నారు. బ్రోకర్స్ వల్ల కావచ్చు. నేను కూడా అజాగ్రత్తగా ఉండకపోవడంతో అలా జరిగి ఉండచ్చు. ఇందులో నా పొరపాటు కూడా తప్పక ఉండి ఉంటుంద‌ని జ‌గ‌ప‌తి బాబు స్ప‌ష్టం చేశారు.

Admin

Recent Posts