Jr NTR : నందమూరి తారకరామారావు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో భీమ్ పాత్ర పోషించి ప్రతి ఒక్కరిని అలరించాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ హాలీవుడ్‌కి కూడా వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. పలువురు హాలీవుడ్ దర్శకులు ఎన్టీఆర్‌ని సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ 30వ చిత్రం ఇటీవల గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ 2025 మార్చి నుంచిమొదలు కానుందని ప్రకటించింది టీమ్. బాలీవుడ్ సినిమాలలోను ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. వార్ 2లో జూనియర్ విలన్‌గా కనిపించబోతున్నాడు. అయితే కెరీర్‌లో ఈ స్థాయికి ఎంతో కష్టపడి వచ్చిన ఎన్టీఆర్ కొన్ని మంచి సినిమాలు వదులుకున్నాడు. అవి కూడా చేసి ఉంటే ఆయన స్థాయి వేరే లెవల్‌లో ఉండేది. దిల్(2003) సినిమా ని మొదట జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పారు కానీ అప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్ లో స్టూడెంట్ కథ చేసిన కారణంగా రిజెక్ట్ చేశాడు. ‘అతనొక్కడే’,’కిక్’ సినిమా ల ను మొదట జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించిన ఆయన రిజెక్ట్ చేశాడు.
ఇక అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘ఆర్య’ సినిమా ని జూనియర్ ఎన్టీఆర్ తో తీయాలి అనుకున్నారు కానీ ఆ లవ్ స్టోరీ తనకు సెట్ కాదు అని రిజెక్ట్ చేయడంతో ఆ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ చెంతకు చేరింది..ఆర్య సినిమా తో అల్లు అర్జున్ కి వచ్చిన స్టార్డం ఎలాంటిదో మనం చూశాం. ఇక బోయపాటి శీను మొదటి సినిమా ‘భద్ర’ మూవీ ని కూడా మొదట జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలి అనుకున్నారు కానీ రవితేజ తో చేసారు . ఇలాఎన్టీఆర్ వదులుకున్న ఈ సినిమా లు ఇతర హీరో ల కి వాళ్ళ కెరీర్ ల కి చాలా ఉపయోగపడ్డాయి. వాటిని ఎన్టీఆర్ చేసి ఉంటే పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ అప్పట్లోనే దక్కి ఉండేదని అంటున్నారు.