వినోదం

Actress : ముసి ముసి న‌వ్వులు న‌వ్వుతూ మురిపిస్తున్న ఈ చిన్నారి ఎవ‌రో తెలుసా..?

Actress : ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల‌కు సంబంధించిన చిన్న‌నాటి పిక్స్ తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అయితే స్టార్ హీరోయిన్ చిన్న‌ప్ప‌టి పిక్స్ చూసి కొంద‌రు షాక్ అవుతుంటారు. అస‌లు ఈ చిన్నారి ఆ హీరోయిన్ అవునా అంటూ కొంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తుంటారు. అయితే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కి సంబంధించిన చిన్న‌నాటి పిక్ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఇందులో ఆ చిన్నారిని చూసి అంద‌రు స్ట‌న్ అవుతున్నారు. అయితే ఈ పిక్ లో క‌నిపిస్తున్న చిన్నారి మరెవ‌రో కాదు క‌త్రినా కైఫ్‌. ఈ అమ్మ‌డు తెలుగుతో పాటు త‌మిళం, హిందీ భాష‌ల‌లోను ప‌లు సినిమాల‌లోను న‌టించి మెప్పించింది.

హీరో విక్కీ కౌశల్ తో ప్రేమాయణం నడిపిన కత్రినా కైఫ్ 2021 డిసెంబర్ లో ప్రేమ‌ వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ ప్రముఖులు హాజరైన ఈ వివాహం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఖరీదైన డిజైనర్ వేర్స్ ధరించి వధూవరులు మెరిసిపోయారు. వివాహం అనంతరం కూడా కత్రినా కెరీర్ కొనసాగిస్తున్నారు. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్స్ ఫోర్ట్‌లో 2021 డిసెంబర్ 9న వీరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. బంధుమిత్రులు, స్టార్స్ మధ్య అంగరంగ వైభవంగా జరిపించారు.

katrina kaif childhood photo viral

పెళ్లికి ముందే కొన్నాళ్ల పాటు డేటింగ్ లో మునిగి తేలిన ఈ స్టార్స్ మ్యారేజ్ తర్వాత కూడా చాలా ప్రైవేట్ గా ఉంటూ వ‌చ్చారు. వివాహా బంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. మ్యారేజ్ అయ్యాక ఇద్దరూ కలిసి పలు టూర్లు, వేకేషన్లు, పార్టీలకు వెళ్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉండ‌గా, మ‌రోవైపు కెరీర్‌లోను దూసుకుపోతున్నారు.

Admin