బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి నరసింహనాయుడు. ఈ సినిమా 2001లో విడుదలై అన్ని కేంద్రాల్లో కలెక్షన్ల సునామి సృష్టించింది. అదే ఏడాది విడుదలైన మరో చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి. వరుసగా ఆరు హిట్స్ తో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్, ఖుషి తో మరో పవర్ ఫుల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా పవన్ సినీ కెరీర్ నే మలుపు తిప్పింది. 2001లోనే ఖుషి, నరసింహనాయుడు చిత్రాలు తెలుగు ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేశాయి. అయితే ఈ రెండు సినిమాల్లో బాక్సాఫీస్ షేక్ చేసిన మూవీ ఏది అనే సందేహం ఫ్యాన్స్ లో ఇప్పటికీ ఉంది.
పవన్ హీరోగా ఎస్. జె సూర్య దర్శకత్వంలో విడుదలైన మూవీ ఖుషి. ఈ మూవీ పవన్ సినిమాల్లోనే వన్ ఆఫ్ ది మైల్డ్ స్టోన్ గా నిలిచింది . ఇక బి.గోపాల్ దర్శకత్వంలో బాలయ్య నటించిన మరో సినిమా నరసింహనాయుడు. ఈ సినిమా అయితే మాస్ ఆడియన్స్ చేత కేకలు పెట్టించింది. రెండు సినిమాలకు బాణీలు కట్టింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మనే. ఇక ఖుషి, నరసింహనాయుడు సినిమాలోని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల మొబైల్స్ లో ఉంటాయి. సంగీత ప్రియులను అంతలా ఆకట్టుకుంది సంగీతం.
కలెక్షన్ల పరంగా చూస్తే అయితే పవన్ కళ్యాణ్ ఖుషి మొత్తంగా 21 కోట్ల పైగా షేర్ కలెక్ట్ చేసింది. నైజాం, కృష్ణ ఏరియాలో నరసింహనాయుడు కంటే సిద్దు నే పై చేయి సాధించాడు. నరసింహనాయుడు విషయానికి వస్తే, ఈ సినిమా 22 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది సీడెడ్ గుంటూరు, నెల్లూరు, ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, కర్ణాటక ప్రాంతాల్లో ఖుషి కంటే కాస్త ఎక్కువ వసూలు చేసింది. సంక్రాంతి కి విడుదలైన నరసింహనాయుడు మూడు నెలల గ్యాప్ లో విడుదలైన ఖుషి, ఈ ఇద్దరు హీరోల సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి.