ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వసూళ్లలో దూసుకుపోతోంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ అయితే సాధిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇందులో ఎన్‌టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ప్రకాష్ రాజ్, హరితేజ, గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటించారు. అయితే దేవర మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
దేవర మూవీని బన్నీతో చేయాల్సి ఉందని, కానీ ఆయనకు బదులుగా ఎన్‌టీఆర్‌తో చేశారని అంటున్నారు.. దీనిపై మీ స్పందన ఏమిటి..? అని జర్నలిస్టులు కొరటాలను ప్రశ్నించగా, అందుకు ఆయన సమాధానం చెబుతూ.. బన్నీ కోసం వేరే కథ సిద్ధంగా ఉంది. ఇది ఎన్‌టీఆర్ కోసం చేసింది మాత్రమే. అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు.. అని అన్నారు.
ఇక పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తారా.. అని అడగ్గా.. అందుకు కొరటాల శివ స్పందిస్తూ.. పవన్ ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి పూర్తయ్యాక ఆయన మళ్లీ సినిమాలు చేస్తారో లేదో తెలియదు.. కనుక ఆయనతో ఇకపై నేను సినిమా చేయకపోవచ్చు.. అన్నారు. దీంతో కొరటాల కామెంట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందో రాదో వేచి చూస్తే తెలుస్తుంది.