తెలుగు సినీ ప్రియులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. తన యాక్టింగ్, స్టైల్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలలో.. ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. అయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏ వార్త అయినా అది మెగా అభిమానులకు చాలా స్పెషల్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ పక్కన ఓ టాలీవుడ్ డైరెక్టర్ నిలబడి ఉన్నారు. అతను ఎవరనుకుంటున్నారా… టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్. టాలీవుడ్ లో ఇప్పటికీ మెహర్ రమేష్ తీసిన కంత్రి, శక్తి, షాడో, బిల్లా వంటి భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందలేకపోయారు. వీటిల్లో బిల్లా సినిమా ఒకటే స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులను మెప్పించగలిగింది. ఇదిలా ఉంటే గతంలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బిల్లా సినిమాని రీ రిలీజ్ చేశారు. ఆ సందర్భంగా మెహర్ రమేష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ హీరోగా అద్భుతమైన సినిమాను కచ్చితంగా చేస్తానని అన్నారు.
కాగా మెహెర్ రమేష్ చిరంజీవితో భోళా శంకర్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ తమిళంలో ఘనవిజయం సాధించినన వేదాళం కి రీమేక్ గా తెలుగులో తెరకెక్కింది. కానీ ఈ మూవీ కూడా రమేష్‌కు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.