నాగార్జున, ఆయన ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమెకు సమస్యలను సృష్టిస్తున్నాయి. ఆమె సమంతకు సారీ చెప్పారు. కానీ నాగార్జునకు చెప్పలేదు. దీంతో ఆయన పరువు నష్టం దావా వేశారు. సారీ చెప్పినా సరే తాను వెనక్కి తగ్గేది లేదని, పరువు నష్టం దావా కచ్చితంగా ఉంటుందని నాగార్జున స్పష్టం చేశారు. దీంతో ఆయన రూ.100 కోట్ల మేర పరువు నష్టం దావా వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.
తాను తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం ముందుంటానని, ఆ విషయంలో తాను సింహం లాంటివాడినని అన్నారు. తన కుటుంబానికి యావత్ సినీ ఇండస్ట్రీ సపోర్ట్‌ను ఇస్తుండడం తనకు సంతృప్తినిస్తుందన్నారు. తన తండ్రి ఆశీర్వాదాలు తమ కుటుంబంపై ఉండడమే అందుకు కారణమని అన్నారు. కాగా సోషల్ మీడియాలో నాగార్జున పెట్టిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇక కొండా సురేఖ వెంటనే నాగార్జునకు క్షమాపణలు చెప్పాలని తెలుగు సినిమా ఇండస్ట్రీ డిమాండ్ చేస్తుండగా ప్రతిపక్ష పార్టీలు ఆమెను సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.