సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో సినీ హీరోయిన్స్ చిన్నప్పటి ఫొటోస్ తెగ హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్‌ని ఏలుతున్న స్టార్ హీరోయిన్ పిక్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది. నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై, ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైంది. స్టార్ హీరోలందరితో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు పొందింది.మరి ఈ అమ్మడు ఎవరో ఇప్పటికే మీకు గుర్తొచ్చి ఉంటుంది. ఆమె మరెవరో కాదు బుట్టబొమ్మ పూజా హెగ్డే.
పూజా హెగ్డే గత కొద్దికాలంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కెరీర్ గ్రాఫ్‌ను టాప్ రేంజ్‌కు తీసుకెళ్లింది. హిట్టు ఫ్లాప్ అనే సంబంధం లేకుండా అగ్ర నటులు భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తుంది. అయితే రివ్వున కెరీర్ గ్రాఫ్ దూసుకెళ్తున్న సమయంలో 2022 సంవత్సరం కాస్త తడబాటుకు గురైంది. అయితే మళ్లీ సక్సెస్ ట్రాక్‌కు ఎక్కేందుకు పూజా హెగ్డే ప్రయత్నాలు చేపట్టింది. గత ఐదేళ్లలో పూజా హెగ్డే వరుస హిట్లతో దూసుకెళ్లింది. దువ్వాడ జగన్నాథం మూవీతో సక్సెస్ యాత్ర ప్రారంభించిన పూజా హెగ్డే.. ఆ తర్వాత అరవింద సమేత, మహర్షి, గద్దల కొండ గణేష్, హౌస్‌ఫుల్ 2, అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాల విజయాలతో టాప్ రేంజ్‌కు చేరుకొన్నది.
రాధేశ్యామ్ సినిమాతో ఫ్లాప్స్ చవి చూసిన పూజా హెగ్డేని ఆ తర్వాత వచ్చిన బీస్ట్, ఆచార్య, సర్కస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అయితే పూజా హెగ్డే పెర్ఫార్మెన్స్‌కు మంచి ప్రశంసలు లభించాయి. నటిగా మెచ్యురిటీని ప్రదర్శించిందనే మాట క్రిటిక్స్ నుంచి వినిపించాయి. ఇటీవలనాగార్జున అక్కినేనితో కలిసి ఓ యాడ్‌లో నటించింది. ఇక సల్మాన్ ఖాన్‌తో కిసీ కా భాయ్, కిసి కా జాన్ అనే చిత్రంలో నటించింది.