వినోదం

Nithin : చిరంజీవికి, నితిన్ భార్య షాలిని కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Nithin &colon; కెరీర్ బిగినింగ్ లో లవర్ బాయ్ గా పేరును సొంతం చేసుకొని&comma; మాస్ ఇమేజ్ సొంతం చేసుకోవడం కోసం అనేక చిత్రాల్లో నటించి బోల్తా పడ్డాడు నితిన్&period; ఆ తర్వాత ఇష్క్ చిత్రంతో మళ్లీ తన కెరీర్ లో లవర్ బాయ్ గా సక్సెస్ ను అందుకున్నాడు&period; నితిన్ గత కొంత కాలంగా వరుస చిత్రాల ప్లాప్స్ తో సతమతమవుతున్నాడు&period; ఇటీవల విడుదలైన మాచర్ల నియోజకవర్గం కూడా నితిన్ కి సరైన సక్సెస్ ను అందించలేకపోయింది&period; భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది&period; కానీ ప్రేక్షకులలో నితిన్ కు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇష్క్ సినిమా సమయంలో నితిన్ కి మరియు షాలినికి మధ్య ఒక స్నేహితుడి ద్వారా పరిచయం ఏర్పడింది&period; వీళ్ళ ప్రేమ విషయం పెళ్లి పీటల దాకా వచ్చే వరకు ఎవరికీ బయటకు తెలియకుండా చాలా సీక్రెట్ గా మెయింటెన్ చేశాడు నితిన్&period; ఇక ఇరువురు తల్లిదండ్రుల అనుమతితో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో నితిన్ జూలై 26&comma; 2020 సంవత్సరంలో అతి తక్కువ కుటుంబసభ్యులు మరియు సన్నిహితుల సాక్షిగా ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు&period; ఇక అప్పటినుంచి భార్య షాలినితో కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు&period; ప్రస్తుతం నితిన్ భార్య గురించి ఒక విషయం బయటకు వచ్చింది&period; షాలిని చిరంజీవి కుటుంబానికి సన్నిహితురాలనే విషయం బయటకు తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59059 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;nithin-wife&period;jpg" alt&equals;"relation between nithin wife and chiranjeevi " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అది ఎలా అంటే షాలిని తల్లిదండ్రులది సంపత్ మరియు నూర్జహాన్ లది కూడా ప్రేమ వివాహమే&period; షాలిని తల్లిదండ్రులిద్దరూ 20 సంవత్సరాలుగా కర్నూల్ లో ఫేమస్ డాక్టర్స్ గా కొనసాగుతూ అక్కడే ప్రగతి నర్సింగ్ హోమ్ కూడా నిర్వహిస్తున్నారు&period; 2008 ఆగస్టులో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే&period; 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున షాలిని తల్లి నూర్జహాన్ ను కర్నూలు నియోజకవర్గంలో నిలబెట్టారు చిరంజీవి&period; నూర్జహాన్ ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో రాజకీయాలకు దూరమయ్యారు&period; ఇక ఆ సమయం నుంచి చిరంజీవికి మరియు షాలిని తల్లిదండ్రులకు మంచి స్నేహం ఏర్పడింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts