వినోదం

Sai Pallavi : ఇంత నాజూగ్గా ఉండ‌డానికి కార‌ణం ఏంటో చెప్పిన సాయి ప‌ల్ల‌వి..!

Sai Pallavi : త‌న‌దైన న‌ట‌న‌, డ్యాన్స్‌తో లేడి ప‌వర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది సాయి ప‌ల్లవి. సాధారణంగా స్టార్ హీరోయిన్లకు కూడా అంత ఫాలోయింగ్ లేదు. కాగా మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీని ఊపేసిన సాయి ప‌ల్ల‌వి ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ప్లాప్ కావడంతో ఆమె సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది. అయితే తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ.. సాయి పల్లవి గ్లామర్ లో కాని.. ఫిజిక్ లో కాని ఏమాత్రం తేడా రాలేదు.చూడ చ‌క్క‌ని అందంతో కుర్రాళ్ల మ‌తులు కొల్ల‌గొడుతూనే ఉంటుంది.

తాజాగా సాయి ప‌ల్ల‌వి త‌ను ఇంత నాజుగ్గా ఉండ‌డానికి గ‌ల కార‌ణం చెప్పుకొచ్చింది. గా ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో పాల్గోన్న సాయి పల్లవి… మాట్లాడుతూ.. తనను అందరూ తన ఫిట్ నెస్ గురించి.. గ్లమర్ గురించి అడుగుతుంటారు అంటూ చెప్పకొచ్చింది. అని కాని నేను దాని కోసం ప్రత్యేకంగా ఎలాంటి కసరత్తులు చేయను. అన్నారు సాయి పల్లవి. సాయి ప‌ల్ల‌వి డాన్స్ విషయంలో ఆమెకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. తాను నాజూగ్గా ఉండటానికి కారణం మాత్రం డాన్స్ అని అంటుంది సాయి పల్లవి. ఏ మాత్రం ఖాళీ దొరికినా నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటాను. అదే నా ఫిట్ నెస్ కి కారణం అని చెప్పుకొచ్చింది..

sai pallavi told about her glamour secret

ఇక మేక‌ప్ గురించి కూడా మాట్లాడుతూ.. మేకప్ వేసుకుంటే నాపై ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందునే నేను ఏ సినిమాకు పెద్దగా మేకప్ వేసుకోను అని చెప్పుకొచ్చింది… నేను బయట ఎలా ఉంటానో అలాగే కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడతాను అని పేర్కొంది.. అయితే నాకు ఎంతో ఇష్టమైన డాన్స్ నాకు ఇంతటి పేరు ప్రతిష్ఠలను తెచ్చిపెడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటూ.. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది సాయి పల్లవి. ఇక తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చాలా భయపడిన‌ట్టు చెప్పుకొచ్చింది.. నా ముఖం మీద మొటిమలు ఉండటంతో పాటు నా డ్రెస్సింగ్, నా వాయిస్ చూసి జనాలు తిడుతారేమో అనుకున్నాను. అందుకే నాకు చాలా భయం వేసేది. కానీ ప్రేమమ్ మూవీ దర్శకుడు నాకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో నన్ను థియేటర్ లో చూసి చాలామంది ఈలలు వేశారు. దాంతో నాకు చాలా నమ్మకం వచ్చింది అని సాయి ప‌ల్లవి పేర్కొంది.

Admin

Recent Posts