వినోదం

కొమురం భీముడో సాంగ్ వెనుక ఇంత కథ ఉందా! రాజమౌళి అక్కడి నుండి తీసుకున్నాడా?

ఆర్ఆర్ఆర్, ఈ సినిమా కథ, కంటెంట్, స్టార్స్, మ్యూజిక్, యాక్టింగ్ ఇలా ప్రతిదీ మూవీని ఒక్కో మెట్టు పైకి ఎక్కించింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూలు సాధించి, తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి రెపరెపలాడించింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీముడిగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన ఈ చిత్రానికి ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు.

ఆయన సంగీతం అందించిన ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యంల జనాలను హత్తుకుంది. రామరాజు చేతిలో కొమురం భీమ్ దెబ్బలు తినే సమయంలో వచ్చే కొమురం భీముడో పాట ప్రేక్షకుల హృదయాలను కదిలించక మానదు. అయితే, రాజమౌళి కొమురం భీముడో సాంగ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ss rajamouli told about komuram bheemudo song

ఆర్ఆర్ఆర్ సినిమాలో అద్భుతమైన సీన్లు ఉన్నాయని, అయితే కొమురం భీముడో సాంగ్ సినిమాకు హైలెట్ గా నిలిచిందని జక్కన్న అన్నారు. ఈ సాంగ్ లో తారక్, చరణ్ యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉందని ఆయన కామెంట్లు చేశారు. కొమరం భీముడో పాటలో భీమ్ ఎదుట భరతమాత ముద్దుబిడ్డగా మోకరిల్లని ధైర్యంతో ఉంటాడని రామ్ లక్ష్యం కొరకు మిత్రుడిని కఠినంగా శిక్షిస్తూ ఆవేదనతో నలిగిపోతూ ఉంటాడని ఆయన చెప్పుకొచ్చారు. ఓ మూవీ నుంచి ఈ సాంగ్ ను స్ఫూర్తి పొందాన‌ని జక్కన్న తెలిపారు.

Admin

Recent Posts