వినోదం

మహానటిలో జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడానికి కారణం అదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగులో మహానటిగా&comma; తెరకెక్కిన ఒకప్పటి దక్షిణ భారత సినీ నటి సావిత్రి జీవిత కథ మహానటి సినిమా&period; ఈ సినిమాకు దర్శకుడు నాగ్ అశ్విన్&comma; నిర్మాతలు సి&period;అశ్విని దత్&comma; స్వప్న దత్&comma; ప్రియాంక దత్ ఈ సినిమా వైజయంతి మూవీస్&comma; స్వప్న సినిమా బ్యానర్స్ కింద విడుదల అయింది&period; ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించగా&comma; దుల్కర్ సల్మాన్&comma; సమంత&comma; విజయ్ దేవరకొండ&comma; రాజేంద్రప్రసాద్&comma; భానుప్రియ ముఖ్యపాత్రలో కనిపించారు&period; మిక్కీ జే మేయర్ చిత్రానికి సంగీతం అందించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా నిర్మాణం మే 2017 లో మొదలై 9 మే 2018à°¨ సినిమా విడుదల అయింది&period; కాగా&comma; ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావుగా నాగచైతన్య నటించారు&period; ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తారని ప్రచారం జరిగిన&comma; ఆయన నటించలేదు&period; చివరికి ఆ పాత్రను ఎవరు పోషించలేదు&period; అయితే ఈ విషయంపై మహానటి మూవీని నిర్మించిన వైజయంతి మూవీస్ అశ్విని దత్ క్లారిటీ ఇచ్చారు&period; ఆలీతో సరదాగా షోలో ఆయన మాట్లాడుతూ రామారావు పాత్రను జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిందన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71610 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;mahanati&period;jpg" alt&equals;"why jr ntr not acted in mahanati movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కొన్ని కారణాలవల్ల కుదరలేదని చెప్పారు&period; ఎన్టీఆర్ పాత్రకు తారక్ పేరు చెప్పగానే మూవీ యూనిట్ మొత్తం సంతోషం వ్యక్తం చేసిందన్నారు&period; అయితే అదే సమయంలో నందమూరి బాలకృష్ణ &OpenCurlyQuote;ఎన్టీఆర్ బయోపిక్’ ప్రకటించారని అన్నారు&period; అశ్వినిదత్&period; దీంతో తమ సినిమాలో రామారావు పాత్రలో ఎవరిని పెట్టి తీసినా ప్రేక్షకులు తప్పుగా భావిస్తారేమోనని అనిపించిందని అన్నారు&period; ఇదే విషయం నాగ్ అశ్విన్ కు చెప్పానన్నారు&period; అయితే మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్ లేకుండా తీస్తానని నాగి తనతో చెప్పాడని గుర్తు చేసుకున్నారు&period; అందుకే మూవీలో ఎన్టీఆర్ కు సంబంధించి కేవలం ఒక షాట్ మాత్రమే పెట్టామన్నారు&period; ఎన్టీఆర్ పామును పట్టుకునే సీన్ తీశామని&comma; అది రామారావు కెరీర్ ఆరంభంలో నిజంగానే జరిగిందట అని చెప్పారు అశ్వినిదత్&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts